KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు పక్కా.. ధీమా వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.
2023లో ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలవడం పక్కా అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో క్రెడాయి ఆఫీసును ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 9 ఏళ్లలో చూసింది...
2023లో ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలవడం పక్కా అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో క్రెడాయి ఆఫీసును ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 9 ఏళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాల మాటలు కోటలు దాటుతాయి కానీ వాళ్లు మాత్రం గడప దాటరని మంత్రి ఈ సందర్భంగా ఎద్దేవ చేశారు.
కరెంట్ సమస్య పరిష్కారం నిజంగానే అంత సులువైనదే అయితే.. 60 ఏళ్లుగా ఎందుకు పరిష్కరించలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. 60 ఏళ్లలో సాధ్యంకాని పనులు తొమ్మిదేళ్లలో సమర్థవంతమైన కేసీఆర్ పాలనలో జరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మంత్రి.. జేబులో ఉన్న 100 నోటును కింద పడేసి.. రోడ్డు మీద చిల్లర నాణేలు ఎవరూ ఏరుకోరని, అలాగే పనిచేసే ప్రభుత్వాన్ని ఎవరూ వదులుకోరన్నారు. మొదటి ఎన్నికల్లో 63 సీట్లతో గెలిస్తే.. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో గెలిచింది అందుకే అని మంత్రి గుర్తుచేశారు. రజినీకాంత్ లాంటి పెద్ద హీరో.. గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పెద్ద బిల్డింగ్‌లు చూసి ఇది హైదరాబాదా? న్యూయార్క్ నగరమా అని అన్నారని మంత్రి తెలిపారు.
కేసీఆర్‌ను కలిసేందుకు ఫాక్స్‌కాన్ చైర్మన్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన ఇది ఇండియానేనా అని ఆశ్చర్యపోయారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ప్రయాణం ఇప్పుడే మొదలైందన్న మంత్రి, ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..