Minister KTR: ఆ రైతు కుటుంబాలకు కేసీఆర్‌ రూ.3 లక్షల సాయం ప్రకటనపై స్పందించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చించేందుకు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే..

Minister KTR: ఆ రైతు కుటుంబాలకు కేసీఆర్‌ రూ.3 లక్షల సాయం ప్రకటనపై స్పందించిన మంత్రి కేటీఆర్‌
Telangana Minister KTR

Updated on: Nov 20, 2021 | 9:22 PM

Minister KTR: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చించేందుకు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని కేసీఆర్ తెలిపారు. అయితే.. చట్టాలు రద్దు చేసినట్లుగానే.. రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేసీఆర్‌ కోరారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. అలాగే ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే రైతు పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

కేసీఆర్‌ సాయం ప్రకటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించడం గర్వకారణంగా ఉంది. పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మరణించి రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలి.. అని ఆయన డిమాండ్‌ చేశారు.

 

ఇవి కూడా చదవండి:

EPFO Subscribers: ఈపీఎఫ్‌ఓలో పెరుగుతున్న సబ్‌స్ర్కైబర్లు.. సెప్టెంబర్‌ 2021లో ఎంత మంది పెరిగారంటే..!

Ola Electric: ఎలక్ట్రిక్‌ వాహనాల టెస్ట్‌ రైడ్లలో దూసుకుపోతున్న ఓలా.. వాహనదారులకు గుడ్‌న్యూస్‌..!