Telangana Formation Day: ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగం..
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 8 ఏళ్లు అవుతోందని, ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామన్నారు మంత్రి కేటీఆర్.
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 8 ఏళ్లు అవుతోందని, ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తొలుత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యావత్ రాష్ట్ర ప్రజల పోరాట ఫలితం తెలంగాణ ఏర్పాటు అని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులు పెంచుకున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. 2018లో రైతు బంధుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు మంత్రి కేటీఆర్. ఆయిల్ ఫామ్ సాగుకు వెయ్యి కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం జరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో సర్థపూర్ గ్రామంలో రూ. 20 కోట్లతో మార్కెట్ యార్డ్ నిర్మాణం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ. 72.15 కోట్లు రైతు భీమా కింద బాధిత రైతు కుటుంబాలకు అందజేయడం జరిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు జల కూడలిగా మారిందన్నారు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్లో భూగర్భ జాలల పెరిగాయని చెప్పారు. 9వ ప్యాకేజ్ ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గంలో 86,150 ఎకరాలకు సాగు నీరు అందనుందని చెప్పారు. 9, 10, 11, 12 ప్యాకేజీల ద్వారా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు ద్వారా మొత్తంగా 2,52,372 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో మిడ్ మానేరులో 5 వందల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. కాళేశ్వరంతో జల విప్లవం వచ్చిందని, త్వరలోనే హరిత, నీటి, గులాబీ, శ్వేత విప్లవాన్ని చూడబోతున్నామని అన్నారు. సిరిసిల్లలో మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.
Watch live! Minister @KTRTRS delivering #TelanganaFormationDay speech from Rajanna Sircilla district#JaiTelangana https://t.co/bw5US4vOsH
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 2, 2022