KTR: మరో టూరిస్టు వచ్చారు.. తిన్నారు.. వెళ్లారు.. అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

|

May 15, 2022 | 8:31 AM

మరో టూరిస్టు వచ్చారు.. తిన్నారు.. వెళ్లారు.. ఎనిమిది ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు... ఈ రోజు కూడా అదే వివక్ష చూపుతున్నారు.. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

KTR: మరో టూరిస్టు వచ్చారు.. తిన్నారు.. వెళ్లారు.. అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు
Ktr Amit Shah
Follow us on

KTR comments on Amit Shah: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణలో పొలిటికల్ టూరిజం సీజన్ కొనసాగుతోందంటూ తనదైన స్టైల్‌లో కౌంటర్ వేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘తెలంగాణలో పొలిటికల్‌ టూరిజం సీజన్‌ కొనసాగుతోంది.. ఈ రోజు మరో టూరిస్టు వచ్చారు.. తిన్నారు.. వెళ్లారు.. ఎనిమిది ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు… ఈ రోజు కూడా అదే వివక్ష చూపుతున్నారు.. బీజేపీ అంటే బక్వాస్‌ జుమ్లా పార్టీ’’ అంటూ కేటీఆర్‌ ఘాటైన విమర్శలు చేశారు.

కాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత కదిలి రావాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నయా నిజాం నవాబును గద్దె దించాలని కోరారు.

ప్రజా సంగ్రామ యాత్ర అధికారం కోసం కాదని.. దళితులు, ఆదివాసీ, యువత, రైతుల సంక్షేమానికి చేస్తున్న యాత్ర అంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌ సాగిస్తున్న అవినీతి పాలనను అంతమొందించడానికే బండి సంజయ్ ఈ యాత్ర చేపట్టారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మొండి బకాయిల చెల్లింపునకు జీహెచ్ఎంసీ సిద్ధం