Minister KTR: హౌసింగ్ ఫర్ ఆల్.. హోంలోన్‌ తీసుకునేవాళ్లకి BRS బంపర్ ఆఫర్.. కేటీఆర్ సంచలన ప్రకటన..

హౌసింగ్ ఫర్ ఆల్.. ఇప్పుడు BRS కొత్త నినాదం ఇదే! తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదనేది టార్గెట్‌. త్వరలోనే ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తేవాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు గుడ్‌ న్యూస్‌ చెప్పారు మంత్రి కేటీఆర్‌. ఇంతకీ..ఈ కొత్త స్కీం విధివిధానాలేంటి..? ఎలా ఉండబోతుందనేది చర్చ నీయాంశమైంది.

Minister KTR: హౌసింగ్ ఫర్ ఆల్.. హోంలోన్‌ తీసుకునేవాళ్లకి BRS బంపర్ ఆఫర్.. కేటీఆర్ సంచలన ప్రకటన..
BRS Working President KTR (File Photo)

Updated on: Nov 25, 2023 | 7:38 AM

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ ప్రజలకు BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గుడ్ న్యూస్‌ చెప్పారు. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో మేనిఫెస్టో ప్రకటిలంచిన BRS పార్టీ..త్వరలోనే ఇంకో కొత్త పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. HICCలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌-2023లో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. BRS ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదిన్నరేళ్లలో కొవిడ్‌, ఎన్నికలు, ఇతర కారణాలతో కేవలం ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలించామని కేటీఆర్‌ చెప్పారు.

ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నవారి కోసం సరికొత్త పథకాన్ని ఆఫర్‌ చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యంతో BRS సర్కార్‌ ఉందన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నది తమ ఉద్దేశ్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే..ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అంటే..డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తారా అని డౌట్ రావచ్చని.. బుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి రెండూ ఉంటాయని..వాటితో పాటుగా మరో కొత్త పథకాన్ని కూడా కేసీఆర్ ఆలోచించారని కేటీఆర్ తెలిపారు.

వీడియో చూడండి..

కొత్తగా ఇళ్లు కొనాలనుకుంటున్న మధ్యతరగతి కుటుంబాల కోసం త్వరలోనే కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఎవరైతే లోన్ తీసుకుని ఇండ్లు కొనుక్కోవాలనుకునే మిడిల్ క్లాస్ వారి కోసం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చూస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆ లోన్‌‌కు సంబంధించిన ఇంట్రెస్ట్‌ను ప్రభుత్వమే కట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..