KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. చాలామందికి సివిక్ సెన్స్ లేకుండా పోయిందని వ్యాఖ్య

| Edited By: Aravind B

Oct 02, 2023 | 10:30 PM

తన పదునైన మాటలతో ప్రత్యర్థుల మాటలకు చెక్ పెట్టే మంచి వాగ్దాటి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో విరామం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేటీఆర్ ఎక్కడికక్కడ తన స్పీచ్‎తో ప్రతిపక్ష పార్టీలపై కౌంటర్లు వేస్తూనే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. చాలామందికి సివిక్ సెన్స్ లేకుండా పోయిందని వ్యాఖ్య
Ktr
Follow us on

తన పదునైన మాటలతో ప్రత్యర్థుల మాటలకు చెక్ పెట్టే మంచి వాగ్దాటి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో విరామం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేటీఆర్ ఎక్కడికక్కడ తన స్పీచ్‎తో ప్రతిపక్ష పార్టీలపై కౌంటర్లు వేస్తూనే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం జిల్లాల పర్యటన తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సోలార్ రూఫింగ్ సైక్లింగ్ ట్రాక్ ప్రారంభోత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో మాట్లాడిన మంత్రి.. దేశవ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితుల పైన, మన లైఫ్ స్టైల్ పైన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఎవరిని ఉద్దేశించి అయినప్పటికీ కొంత ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. మన లైఫ్ స్టైల్ మారాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యం పై అందరూ దృష్టి సారించాలని, లగ్జరీ లైఫ్ కావాలనుకుంటూ హెల్త్ ని పట్టించుకోవట్లేదు…అంటూ ప్రస్తుత లైఫ్ స్టైల్ పైన కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనదేశంలో దాదాపుగా చాలామందికి సివిక్ సెన్స్ లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవంలో ఈ కామెంట్స్ చేయడం కొంత ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నార్సింగ్ దగ్గర ఓ‎ఆర్‎ఆర్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్‌లో ఈ సైకిల్ ట్రాక్‎ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదో సైకిల్ ట్రాక్ ఓపెన్ చేసాము సైక్లిస్ట్ లేని సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే వాహనాలు వెళ్లడానికి వీల్లేదని చెప్పే సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు.ఆ సైకిల్ ట్రాక్‎ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని గుర్తు చేస్తూ చాలామందికి ఇలాంటివి పాటించాలనే ఆలోచన ఇంకా రాలేదు అనే అంశాన్ని గుర్తు చేశాడు. ఆ సమయంలోనే మనకు సివిక్ సెన్స్ లేదు అన్న మాటని చాలామంది ట్రోల్ చేస్తారని కూడా ఫన్నీగా కామెంట్ చేశారు మంత్రి. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ కాపాడుకోవడం అందరి బాధ్యత అని దాని పర్యవేక్షణ, భద్రత అన్ని మానిటరింగ్ అవుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా సైక్లింగ్‎కి హైదరాబాద్‌నీ గమ్యస్థానం చేస్తామని.. హైదరాబాద్‎లో ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఈవెంట్స్ జరిగేలా ప్రయత్నం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి