Minister KTR: మరోసారి మంచిమనసును చాటుకున్న మంత్రి కేటీఆర్.. రోడ్డు యాక్సిండెంట్ బాధితులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలింపు

|

Jul 27, 2021 | 6:40 AM

Minister KTR: ఐటి మంత్రి కేటీఆర్.. మంచితనం మానవత్వం ఉన్న మనిషి మరోసారి వెల్లడైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను తన కాన్వాయ్ లో ఆస్పత్రికి..

Minister KTR: మరోసారి మంచిమనసును చాటుకున్న మంత్రి కేటీఆర్.. రోడ్డు యాక్సిండెంట్ బాధితులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలింపు
Ktr
Follow us on

Minister KTR Humanity: ఐటి మంత్రి కేటీఆర్.. మంచితనం మానవత్వం ఉన్న మనిషి మరోసారి వెల్లడైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను తన కాన్వాయ్ లో ఆస్పత్రికి పంపించి బాధితులకు చికిత్సనుఁ సకాలంలో అందేలా చేసిన మంత్రి కేటీఆర్ .. ఓ వైపు కొంతమంది పోలీసులు ప్రోటోకాల్ అంటూ.. ఎమర్జెన్సీ టైం లో కూడా ఇబ్బంది పెట్టిన వేళ..మంత్రి కేటీఆర్ చూపించిన మానవత్వం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

సిద్దిపేట ఔటర్ బైపాస్ పైన,మెడికల్ కాలేజీ దగ్గరలో బైక్ ఆక్సిడెంట్బై జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు డివైడర్ ని ఢీకొట్టి కిందపడ్డారు. క్షతగాత్రులు సిద్దిపేట కాళ్ళకుంట కాలనీకి చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులుగా గుర్తించారు. అయితే అదే సమయంలో ప్రమాద సంఘటనా స్థలం నుండి మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ లో వెళ్తున్నారు. ఈ ప్రమాదాన్ని చూసి, వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. కారు నుంచి దిగి, తన కాన్వాయ్ లోని కార్లలో .. తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను ఎక్కించారు.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తన పిఎ మహేందర్ రెడ్డిని, ఎస్కార్ట్ పోలీస్ లను ఇచ్చి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ లో సూచించారు మంత్రి కెటిఆర్. ఆపదలో స్పందించిన మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుపై అక్కడే ఉన్న వాహన దారులు, క్షతగాత్రుల బంధువులు కృతఙ్ఞతలు తెలిపారు.

 

Also Read:

Tokyo Olympics 2020 Live: మను, సౌరభ్‌ల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ప్రారంభం