CM KCR Health: సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ .. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ఈ విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చారు. కేసీఆర్‌కు ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. ఓ జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ ఈ విషయం వెల్లడించారు.

CM KCR Health: సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ .. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్
CM KCR, Minister KTR

Updated on: Oct 07, 2023 | 6:45 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ఈ విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చారు. కేసీఆర్‌కు ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. ఓ జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ ఈ విషయం వెల్లడించారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా జ్వరం, దగ్గు సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న వేళ.. ఎప్పటిలాగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రార్థనలు చేస్తున్నారు. కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ల బృందం చెప్పినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం శుక్రవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. విద్యార్థులతో కలిసి టిఫిన్‌ చేసిన కేటీఆర్‌… రుచి ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించారు. పిల్లలకు మంచి పోషక ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు కేటీఆర్‌. ఎప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ నాణ్యతను చెక్‌చేయాలని అధికారులను ఆదేశించారు. అటు రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో మంత్రులు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.. విద్యార్థులకు వడ్డించే అల్పాహారాన్ని పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఆపై విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. తర్వాత మంత్రులు ఇద్దరు విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.