కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల తూటాలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా.. ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఉక్కు కర్మాగారానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉద్దేశ పూర్వకంగానే మొండిచెయ్యి చూపారని ఆరోపించారు. తన మిత్రుడైన అదానీకి లబ్ధి చేకూర్చేందుకేనని సెటైర్ వేశారు. ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి రాకపోవడం వెనకున్న ప్రధాని నిర్వాకాన్ని టీఎస్‌ఎండీసీ ఛైర్మన్ క్రిషాంక్ వెల్లడించారన్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కంటే తన స్నేహితుడి ప్రయోజనాలే ప్రధానికి ఎక్కువ అయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గతంలో లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ పీఎం మోడీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
అదానీ కంపెనీ, కొరియన్ కంపెనీ అయిన పాస్కోలు దాదాపు రూ.38000 కోట్ల స్టీల్ మిల్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ కారణంగానే బయ్యారం ఉక్కు పరిశ్రమకు మొండి చెయ్యి చూపారు. మంచి పరిశోధన చేసి వాస్తవాలను బయటపెట్టారంటూ క్రిషాంక్‌ను అభినందనలు. బయ్యారానికి ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలిసింది.
– కేటీఆర్, తెలంగాణ మంత్రి
Well researched & great expose Krishank ?
Now we know the REAL reasons why Modi Govt does not want to honour promise made in the APRA legislation to setup an integrated steel plant at Bayyaram
Shame that his Crony’s interests outweigh nation’s for Modi Ji https://t.co/Tobks5wCNU
— KTR (@KTRBRS) February 18, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..