KTR Defamation Suit: ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్

|

Sep 20, 2021 | 11:44 AM

తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ.. పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీ రామారావు.

KTR Defamation Suit: ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్
Ktr
Follow us on

KTR Defamation Suit: తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ.. పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీ రామారావు. దుష్ప్రచారం చేసిన వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఇక శిక్ష తప్పదంటూ ట్వీట్ చేశారు. టీపీసీసీ రేవంత్.. కేటీఆర్ మధ్య వార్ మరింత ముదిరింది. తనపై అనేక ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. వీటికి స్పందిస్తూ కేటీఆర్.. న్యాయ పోరాటానికి దిగారు.


మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్టర్ వేదికగా రచ్చ కొనసాగుతోంది. విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చరర్‌పై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను సిద్ధమా అంటూ రేవంత్ ట్వీట్ చేయగా.. తాను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నానని…రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ తిరిగి ట్వీట్ చేశారు. దీనిపై రేవంత్ మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమతో పాటు కేసీఆర్ కూడా సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణం సీబీఐ కేసులలో లై డిటెక్టర్ టెస్ట్‌లకు వస్తారా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్ తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు.

Read Also…  siri hanumant Photos: బ్లాక్ డ్రస్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. సిరి హనుమంత్ ఫోటోలు..