Munugode: “మునుగోడు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే.. దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం”.. మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్

|

Sep 10, 2022 | 6:36 PM

తెలంగాణ (Telangana) పాలిటిక్స్ లో మునుగోడు హీట్ పెంచుతోంది. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నిక రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు...

Munugode: మునుగోడు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే.. దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం.. మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్
Minister Jagadish Reddy
Follow us on

తెలంగాణ (Telangana) పాలిటిక్స్ లో మునుగోడు హీట్ పెంచుతోంది. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నిక రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. విజయం తమదంటే తమదేనని పార్టీలన్నీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడులో విజయం టీఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు. అకడ గుబాళించేది గులాబీ జెండాయేనని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీకి (BJP) స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని చెప్పడం విశేషం. మర్రిగూడ మండలం కొండూరు గ్రామ ఉప సర్పంచ్, ఆయన అనుచరులు హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌ రెడ్డిని కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కమలం పార్టీకీ తెలంగాణలో స్పేస్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు. గల్లీలో రాదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఆయన పాలనలో రాష్ట్రం సురక్షితంగా ఉందని చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

టీఆర్ఎస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సీఎం కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా.. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తుండటంతో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైంది. పాల్వాయి స్రవంతిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ముకుల్ వాస్నిక్ పేరిట ప్రకటన విడుదల చేశారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లే. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయం ప్రస్తుతానికి మిస్టరీగానే మారింది. ఇక చూడాలి.. ఎవరి పేరు ప్రకటిస్తుందో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..