Harish Rao: ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్క బోర్లా పడింది.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..

|

Jun 10, 2023 | 9:49 PM

Harish Rao on AP leaders: ఆంధ్రప్రదేశ్ నేతలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా.. హరీష్ రావు మరోసారి ఏపీ నేతలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పాలకుల తీరు వల్లే ఏపీ రాష్ట్రం వెల్లకిలా పడిందంటూ కామెంట్ చేశారు.

Harish Rao: ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్క బోర్లా పడింది.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..
Harish Rao
Follow us on

Harish Rao on AP leaders: ఆంధ్రప్రదేశ్ నేతలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా.. హరీష్ రావు మరోసారి ఏపీ నేతలు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పాలకుల తీరు వల్లే ఏపీ రాష్ట్రం వెల్లకిలా పడిందంటూ కామెంట్ చేశారు. వాళ్లది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అంటూ పేర్కొన్నారు. హైటెక్‌ పాలన అంటూ గతంలో హడావుడి చేశారని.. అక్కడి నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రధానంగా ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్క బోర్లా పడిందింటూ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలో మాట్లాడిన హరీష్ రావు.. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారని.. హైదరాబాద్‌లో రోజూ కర్ఫ్యూ ఉంటుందని చెప్పారని. కానీ.. వాటన్నింటినీ పక్కకు నెట్టి తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలుస్తోందంటూ పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధి తెలియాలంటే పక్క రాష్ట్రం వెళ్లి చూడాలంటూ నేతలకు హితవు పలికారు. ఏపీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా సీఎం కేసీఆర్ అభివృద్ది చేశారని.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు. కాగా. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.

సంగారెడ్డి పర్యటన అనంతరం.. హైదరాబాద్‌ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. గతంలో 20 ఏళ్లకు ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లలో 21 మెడికల్‌ కళాశాలలు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..