Minister Harish Rao: అదంతా ఫాల్స్ ప్రచారం.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వాదనపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..

|

Jun 02, 2023 | 7:49 PM

మొత్తం రూ. 79 వేల కోట్లు విడిగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్ల కేటాయింపులు కేటాయించామని కేంద్రం చేస్తున్న వాదన అంతా ఉత్తదే అని అన్నారు హరీష్ రావు. కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మొత్తం రూ. 12వేల 180 కోట్లు కేంద్రం..

Minister Harish Rao: అదంతా ఫాల్స్ ప్రచారం.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల  వాదనపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..
Minister Harish Rao
Follow us on

తెలంగాణకు నిధులపై కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాడి వేడి చర్చపై మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై టీవీ 9తో మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడారు. మొత్తం రూ. 79 వేల కోట్లు విడిగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్ల కేటాయింపులు కేటాయించామని కేంద్రం చేస్తున్న వాదన అంతా ఉత్తదే అని అన్నారు హరీష్ రావు. కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మొత్తం రూ. 12వేల 180 కోట్లు కేంద్రం అందించిందన్న వాదనను ఆయన కొట్టేశారు. ఇందులో నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ. 5వేల 200 కోట్లకు మించి తెలంగాణకు రాలేదని అన్నారు.

జాతీయ రహదారులపౌ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. కేంద్రం వేస్తున్న రోడ్లపై బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ప్రజల నుంచి టోల్ వసూలు చేసి తిరిగి కడుతున్నారని.. ఇది కేంద్ర ఇచ్చింది ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాము వేసిన రోడ్లపై ఎక్కడ కూడా టోల్ వసూల్ చేయడం లేదని అన్నారు.

జీఎస్‌టీ పరిహారం కేంద్రం ఇచ్చిందంటే ఎలా అని ప్రశ్నించారు. మనం కట్టిన పన్నులు మనకు కేంద్రం ఇచ్చిందంటే ఎలా అని అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ కేంద్రం ఇచ్చిందడం పెద్ద జోక్ అని అభివర్ణించారు. ఐదేళ్లుగా రూ. 40 కోట్లు అని చూపిస్తున్నారని అన్నారు. ఇంత వరకు ఆ యూనివర్సిటీపై నాలుగు రూపాయలు ఖర్చు పెట్టలేదని అన్నారు.

తెలంగాణకు నిధులపై కేంద్రం వాదనపై వీడియోను ఇక్కడ చూడండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం