AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Budget: ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ.. బడ్జెట్ లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం.. మంత్రి హరీశ్..

ఎన్నికల ఏడాదిలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్.. నియోజకవర్గాల అభివృద్ధికి పెద్ద పీట వేసింది. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్నందున..

Telangana Budget: ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ.. బడ్జెట్ లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం.. మంత్రి హరీశ్..
Minister Harish Rao
Ganesh Mudavath
|

Updated on: Feb 06, 2023 | 1:14 PM

Share

ఎన్నికల ఏడాదిలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్.. నియోజకవర్గాల అభివృద్ధికి పెద్ద పీట వేసింది. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్నందున నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చే స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను భారీగా పెంచింది. గతేడాది రూ.2 వేల కోట్లు ఇస్తే ఈసారి ఏకంగా రూ.10,348 కోట్లకు పెంచింది. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి హరీశ్ రావు. గ్రామీణ, పట్టణ రోడ్ల బాగు కోసం, సాగునీటి ప్రాజెక్ట్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పల్లె ప్రగతి, పంచాయతీరాజ్‌ శాఖకే ఏకంగా 31,426 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కోసం ఈ ఏడాది రైతు రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధుకు రూ.17,700 కోట్లు ఇచ్చారు. రైతు బంధుకు భారీగా రూ.15,075 కోట్ల కేటాయింపులు చేశారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు కేటాయించారు.

ఇటీవలే శంకుస్థాపన చేసిన శంషాబాద్‌ వరకు మెట్రో ప్రాజెక్ట్‌ను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. దీని కోసం బట్జెడ్‌లో ఈ ఏడాది 500 కోట్లు కేటాయించింది. మొత్తం మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఓల్డ్‌ సిటీలో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు కేటాయించారు.

ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామం. సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్‌ను సవరిస్తాం. కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయితీలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలనూ దెబ్బతీసింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.450 కోట్లు చొప్పున తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. మూడు సంవత్సరాలకు గానూ రూ.1,350 కోట్లు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు ఇవ్వాలి. కానీ కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

         – హరీశ్ రావు, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..