Harish Rao: మీకు నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతినా? కేంద్ర మంత్రి షెకావత్‌పై హరీశ్ రావు ఫైర్..

|

Aug 18, 2022 | 7:30 PM

కేంద్రానికి నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతినా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్‌రావు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వ్యాఖ్యల అనంతరం మంత్రి హరీశ్ రావు గురువారం మీడియాతో మాట్లాడారు.

Harish Rao: మీకు నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతినా? కేంద్ర మంత్రి షెకావత్‌పై హరీశ్ రావు ఫైర్..
Harish Rao
Follow us on

Harish Rao on Gajendra Singh Shekhawat : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి షెకావత్‌ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. గతంలో పార్లమెంట్‌ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకొని ఇప్పుడు విమర్శించడం తగదంటూ హరీశ్ సూచించారు. మెచ్చుకున్న నోటితోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అది నోరా, మోరీనా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హరీష్‌రావు. అంటే.. కేంద్రానికి నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతినా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్‌రావు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వ్యాఖ్యల అనంతరం మంత్రి హరీశ్ రావు గురువారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. అద్భుతమైన ప్రాజెక్టని కొనియాడిన కాళేశ్వరం ఇప్పుడు రాజకీయం మారడంతో అవినీతిగా మారిందా అని కేంద్రాన్ని హరీష్ రావ్‌ నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టంగా ప్రకటించిందని హరీష్‌ రావు అన్నారు. రాజకీయం కోసం ప్రెస్‌మీట్లు పెట్టి అవినీతి జరిగిందని మాట్లాడటం బీజేపీకే చెల్లిందని విమర్శించారు. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో గోదావరిలో ఉప్పొంగి ప్రవాహించి వరద రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయని హరీశ్‌ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిక్షేపంగా పనిచేస్తోందని ప్రకటించారు. రాజకీయం కోసం బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అతి త్వరలో పంపులు తిరిగి ప్రారంభమైన యాసంగికి నీళ్లు అందుతాయని ప్రకటించారు.

రాజకీయం కోసం ఏ మాటైనా మాట్లాడేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉంటారని హరీశ్‌ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి అనుమతులను కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చిందని స్పష్టం చేశారు. బురద జల్లడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..