Gangula Kamalakar: రాజకీయ లబ్ధి పొందేందుకు బండి సంజయ్‌ దీక్ష.. మంత్రి గంగుల ఆగ్రహం..

పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు చేశారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్‌ దీక్ష చేశారని గంగుల ఆరోపించారు...

Gangula Kamalakar: రాజకీయ లబ్ధి పొందేందుకు బండి సంజయ్‌ దీక్ష.. మంత్రి గంగుల ఆగ్రహం..
Gangula

Edited By: Ravi Kiran

Updated on: Jan 03, 2022 | 9:29 AM

పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు చేశారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్‌ దీక్ష చేశారని గంగుల ఆరోపించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించే బాధ్యత బీజేపీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు.

బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదని, కొవిడ్‌ను వ్యాప్తి చేసే దీక్ష అని ఎద్దేవా చేశారు. ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష చేయొచ్చా అని గంగుల ప్రశ్నించారు. దిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్‌ చేయాదా? అని అన్నారు.

కాగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తలపెట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Read Also.. Bandi Sanjay: బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. కరీంనగర్‎లో ఉద్రిక్తత..