AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రచ్చ లేపుతున్న మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

తెలంగాణలో BRS గెలుపుపై మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్స్‌ నిజమేనా..? ఆయన మాటలు వక్రీకరించారా..? ఇంతకీ మొన్న ఎర్రబెల్లి ఏమన్నారు..? నిన్న ఏం చెప్పారు..? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబాబాద్‌జిల్లా నర్సింహులపేటలో మొన్న నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో

Telangana: రచ్చ లేపుతున్న మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
Errabelli Dayakar Rao
Shiva Prajapati
|

Updated on: Jan 19, 2023 | 7:35 AM

Share

తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపుపై మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్స్‌ నిజమేనా..? ఆయన మాటలు వక్రీకరించారా..? ఇంతకీ మొన్న ఎర్రబెల్లి ఏమన్నారు..? నిన్న ఏం చెప్పారు..? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబాబాద్‌జిల్లా నర్సింహులపేటలో మొన్న నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో రాబోయే ఎన్నికలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గరిష్ఠంగా 25 స్థానాలు, బీజేపీ 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ మాత్రం 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ప్రజా వ్యతిరేకత ఉన్న 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ఆ సంఖ్య 100కు పెరుగుతుందన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఆరేడు జిల్లాల్లోను, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే పోటీ ఉంటుందని, మిగతా చోట్ల బీఆర్ఎస్‌కు పోటీ లేదని చెబుతూ కేడర్‌ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరకత ఉందనేలా ప్రచారం చేయడమే కాకుండా.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. రాష్ర్టంలో 80 సీట్లు తప్పకుండా బీఆర్‌ఎస్ గెలుస్తుందనీ మరో 20 సీట్ల కోసం గట్టిగా పనిచేయాలని మాత్రమే చెప్పానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అనే మాట అవాస్తవమన్నారు. నేతల మధ్య విభేదాలు పక్కనపెట్టాలని మాత్రమే అన్నానని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..