Sonusood: సిద్దిపేటకు వచ్చిన సోనూసూద్.. ఘన స్వాగతం పలికిన చెల్మితండా వాసులు..
బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కి సిద్దిపేటజిల్లాలో ఘనస్వాగతం లభించింది. కరోనా కష్టకాలంలో సోనూసూద్ చేసిన సేవలను గుర్తుగా చల్మే తండాలో విగ్రహాం నెలకొల్పారు అక్కడి స్థానికులు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కి సిద్దిపేటజిల్లాలో ఘనస్వాగతం లభించింది. కరోనా కష్టకాలంలో సోనూసూద్ చేసిన సేవలను గుర్తుగా చల్మే తండాలో విగ్రహాం నెలకొల్పారు అక్కడి స్థానికులు. ఈ నేపథ్యంలో సిద్దిపేటజిల్లా దూల్మిట్ట మండలం చెల్మి తండాలో నటుడు సోనుసూద్ పర్యటించారు. గిరిజన సంప్రదాయం మంగళ హారతులతో చెల్మి తండా వాసులు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామైంది. సోనూసూద్‌కు చేర్యాల పెయింటింగ్‌ను బహుకరించారు అభిమానులు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో సోనుసూద్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు చెల్మి తండాలో గుడి కట్టారు. తండా వాసులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు చెల్మి తండాకు సోనుసూద్ వచ్చారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సహాయం చేయడంతో చెల్మి తండా గ్రామస్తులు, యువకులు సోనుసూద్ పై మరింత అభిమానం పెంచుకున్నారు. తండా వాసులు సోనుసూద్‌ను దేవుడిగా భావించి..వారి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రెండేళ్ల క్రితం తండాలో తనకు గుడి కట్టారని తెలిసిందని, ఇక్కడకు రావాలని చాలా కోరిక ఉండేదన్నారు సోను. గ్రామస్తులు, ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాలని వచ్చానని చెప్పారు. కరోనా ఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తానన్నారు. చెల్మి తండా వాసులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..