Errabelli Dayakar Rao: హర హర శంభో శంకర.. మహాశివుడి పరమభక్తుడిగా మంత్రి ఎర్రబెల్లి..

|

Jan 27, 2023 | 12:48 PM

పరమ శివ భక్తుడిగా మారిపోయారు. వరంగల్ చారిత్రక పర్వత గిరి శివాలయంలో పునః ప్రతిష్ట పూజలో కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో..

Errabelli Dayakar Rao: హర హర శంభో శంకర.. మహాశివుడి పరమభక్తుడిగా మంత్రి ఎర్రబెల్లి..
Minister Errabelli Dayakar Rao
Follow us on

ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు.. తెలంగాణ‌ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు.. ఎప్పుడూ రాజకీయాలతో ఫుల్ టు ఫుల్ బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు.. ఈ మధ్య దైవ చింతనలో ఉంటున్నారు. గత రెండు వారాల క్రితం వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఇప్పుడు పరమ శివ భక్తుడిగా మారిపోయారు. వరంగల్ చారిత్రక పర్వత గిరి శివాలయంలో పునః ప్రతిష్ట పూజలో కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో పూర్తి సంప్రదాయ పద్దతుల్లో పూజా కార్రక్రమాల్లో పాల్గొన్నారు. మూడు రోజుపాటు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మహా లింగార్చన, పంజామృతాభిషేకం కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దంపతులు నిర్వహిస్తున్నారు.

పర్వతగిరి.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్వగ్రామం కావడంతో.. అన్నీ తానై ముందుండి నడిపించారాయన. 800 ఏళ్ల నాటి ఈ శివాలయానికి పూర్వవైభవం తేవడమే తమ లక్ష్యంగా చెబుతున్నారు ఎర్రబెల్లి కుటుంబ సభ్యులు. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పేలా పర్వతగిరి శివాలయం పునః నిర్మాణం చేశారు.

పర్వతగిరిలో వెలసిన శివుడికి ఇవాళ మహాలింగార్చనతో పాటు పంచామృత అభిషేకం వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ పవిత్ర కార్యక్రమాల్లో పెద్ద భారీ ఎత్తున పాల్గొన్నారు భక్తజనులు.

శనివారం విగ్రహ ప్రతిష్టాపన, మేలుకొలుపు వంటి ప్రధాన ఘట్టాలుంటాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 700 వందల మెట్లను నూతనంగా నిర్మించారు. గుట్టమీదికి వెళ్లడానికి వృద్ధులకు వాహన వసతి కల్పిస్తున్నారు. జాతరలో భక్తి భావం పెంపొందించే విధంగా శివుడి మీద పర్వతాల శివాలయం కోసం ప్రత్యేకంగా పాటలు రాయించి నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. శివాలయ జాతర కరపత్రాలను చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వెళ్లి ఇంటింటికి ఆహ్వానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం