Telangana Integration Day: తొలిసారి 7వ నిజాం తీరును తప్పుపట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎం ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 7 నిజాం పెద్ద తప్పు చేశారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చివరి ఏడో నిజం చాలా పెద్ద తప్పు చేశాడని అన్నారు. ఆనాడు 7వ నిజాం విపరీతమైన అహంకారం ప్రదర్శించాడని వ్యాఖ్యానించారు. లార్డ్ మౌంట్ బాటన్, ఖాసీం రజ్వి ఇద్దరూ కలిసి నిజాం ను దారుణంగా మోసం చేశారన్నారు. 1948, జూన్ 15న ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఒక డ్రాప్ట్‌ను నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆమోదించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. డ్రాప్ట్‌ను నిజాం అంగీకరించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగి ఉండేది కాదన్నారు. కశ్మీర్‌లకు ఇచ్చిన 370 కన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని వ్యాఖ్యానించారు. కానీ, ఆనాడు అందరూ కలిసి నిజాంను మోసం చేశారని ఆరోపించారు అసదుద్దీన్ ఒవైసీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..