
Telangana: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ సెప్టెంబర్ 17 చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్ణయించాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు కేసీఆర్ కూడా నేడు జరగనున్న క్యాబినేట్ భేటీలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు జరపనున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో సెప్టెంబర్ 17 టెన్షన్ కాక పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరో సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. సెప్టెంబరు 17ను జాతీయ సమగ్రత దినోత్సవంగా జరిపించాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖలు రాశారు. ‘సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం విలీమైన రోజు. అందుకే ఆరోజును జాతీయ సమగ్రత దినోత్సవంగా జరపాలి. నాడు తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు అంతా కలిసి పోరాడారు. తురేభాజ్ ఖాన్ వీరోచిత పోరాటం చేశారు’ అని లేఖలో గుర్తు చేశారు అసదుద్దీన్.
పాతబస్తీలో భారీ బహిరంగ సభ..
కాగా సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర చేపడతామని ఒవైసీ ప్రకటించారు. అదే రోజు భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమాల్లో తమ ఎమ్మెల్యేలు, పార్టీ అభిమానులందరూ భారీగా పాల్గొంటారని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..