Telangana: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్‌.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన అధికారులు. వచ్చే 3 రోజులూ..

|

Jun 04, 2023 | 6:00 PM

కొన్ని రోజులుగా ఎండలు, వేడిమితో ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్‌ చెప్పింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. దక్షిణ చత్తీస్ఘడ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా..

Telangana: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్‌.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన అధికారులు. వచ్చే 3 రోజులూ..
Rains
Follow us on

కొన్ని రోజులుగా ఎండలు, వేడిమితో ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్‌ చెప్పింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. దక్షిణ చత్తీస్ఘడ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్‌ తమిళనాడు వరకు ఉపరిత ద్రోణి కొనసాగనున్నట్లు వాతావారణ అధికారులు తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆదివారం, సోమవారం తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈరోజు ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇక మంగళవారం సైతం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉండనుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 42°C నుంచి 44°Cగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. నగరంలో 38°C నుంచి 41°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..