Medical Tourism: తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్యం.. మెడికల్ టూరిజానికి హబ్‌గా హైదరాబాద్

Medical Tourism in Hyderabad: ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కొలువు దీరాయి. రాకెట్ వేగంతో ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. అటు నిర్మాణం రంగానికి తిరుగులేదు. శాంతిభద్రతలకు ఢోకాలేదు. మానవ వనరులకు కొదవలేదు. ఇలా సకల రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హైదరాబాద్.. మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Medical Tourism: తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్యం.. మెడికల్ టూరిజానికి హబ్‌గా హైదరాబాద్
Medical Tourism

Edited By: Janardhan Veluru

Updated on: Jul 06, 2024 | 10:56 AM

వరల్డ్ క్లాస్ మెడికల్ ట్రీట్‌మెంట్ ఎక్కడో అమెరికా, యూరప్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంటుందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ అంతకంటే గొప్ప చికిత్సా విధానం మన హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వైద్యపరికరాలు, నిష్ణాతులైన వైద్యులు.. వెరసి భాగ్యనగరం మెడికల్ టూరిజం హబ్‌ గా అవతరిస్తోంది. అవును.. వైద్య చికిత్స కోసం దేశ, విదేశాల చూపు.. ఇప్పుడు హైదరాబాద్ వైపు ఉంది. పలు రంగాలకు నిలయంగా మారిన హైదరాబాద్.. మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతలు తొక్కుతోంది. బెస్ట్ ట్రీట్మెంట్.. అదీ తక్కువ ఖర్చుతోనే కావాలనుకునే  విదేశీ మెడికల్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కొలువు దీరాయి. రాకెట్ వేగంతో ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. అటు నిర్మాణం రంగానికి తిరుగులేదు. శాంతిభద్రతలకు ఢోకాలేదు. మానవ వనరులకు కొదవలేదు. ఇలా సకల రంగాల్లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్.. మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెరుగైన వైద్య చికిత్స అనగానే ఇప్పుడు తన వైపు చూసేలా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది హైదరాబాద్. విదేశాల్లో కూడా సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా చేసి చూపించాయి ఇక్కడి ఆసుపత్రులు. గత పదేళ్లుగా చూసుకుంటే హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు ఓవర్సీస్ పేషెంట్ల తాకిడి ఎక్కువైంది. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, సూడాన్, మిడిలీస్ట్ దేశాలు ఒమన్, ఇరాక్, యెమన్, ఇటు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి