జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది రెచ్చిపోయింది. డ్యూటీలో ఉన్న నర్సులు, వైద్య సిబ్బంది సెలబ్రేషన్స్ పేరుతో హంగామా చేశారు. సౌండ్ బాక్సులు పెట్టుకుని డాన్సులు చేశారు. ఆసుపత్రిలో రోగులు ఉన్నారన్న ధ్యాస కూడా మరిచి చిందులేశారు. ప్రక్కనే పేషెంట్స్ ఉన్న పెద్ద పెద్ద సౌండులతో డ్యాన్సులు చేయడంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ తరుఫు బంధువులు. ఇప్పుడు ఆసుపత్రి గదిలో డాన్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్నారు.
క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని సెలబ్రేషన్స్ కోసం ప్రాక్టీస్ చేశారు. ప్రభుత్వ అసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, నర్సులు స్టెప్పులు వేశారు. డ్యాన్స్ ప్రాక్టీసు కోసం ప్రభుత్వ ఆసుపత్రి గదులనే వాడుకోవడం విమర్శలకి దారి తీస్తుంది. ప్రక్కనున్న గదులలో చికిత్స పొందుతున్న పేషెంట్స్
ఉన్నరన్న విషయాన్నీ మరిచి పోయారు.
వీడియో చూడండి..
డ్యూటిలో ఉన్న నర్సులు, వైద్య సిబ్బంది ఇలా డ్యాన్సులు చేయడంపై రోగుల తరుపున బంధువులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు… చాలసేపు పెషేంట్లని పట్టించుకోకుండా డ్యాన్సులు చేయడం పై అగ్రహించిన పేషెంట్స్ తరుపున బంధువులు ఆసుపత్రి అర్ఎంకి ఫిర్యాధు చేశారు. అయితే ఆర్ఎం కూడా నర్సులు,సిబ్బంది క్రిస్మస్ కోసం ప్రాక్టీసు చేస్తామని రిక్వెస్ట్ పెడితే తానే పర్మిషన్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు.
మరోవైపు షేషెంట్స్ చికిత్స పొందుతుంటే పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు చేయడంపై రోగి బంధువులు మండి పడుతున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాదికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు. అధికారులు ఆసుపత్రికి చేరుకుని రోగుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..