అతివల డైరెక్షన్ లో అమ్మల జాతర.. నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు.. ఎలా ఉందంటే..

ఓరుగల్లు పేరు చెప్పగానే రాని రుద్రమదేవి పౌరుషం గుర్తుకొస్తుంది.. నారీమణుల నవశాఖానికి ఓరుగల్లు ఆడబిడ్డల పౌరుషాన్ని చిహ్నంగా భావిస్తారు.. సమ్మక్క సారక్క దేవతలను వీరవనితలుగా.. ధీరత్వానికి.. పౌరుషానికి.. ప్రతీకలుగా కొలుస్తారు.. పాలకుల ప్రయోగంతో ఓరుగల్లు స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది.. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా అంతా అతివల పాలనలోనే కొనసాగుతుంది..

అతివల డైరెక్షన్ లో అమ్మల జాతర.. నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు.. ఎలా ఉందంటే..
Medaram Trust Board

Edited By:

Updated on: Jan 18, 2026 | 9:09 AM

సమ్మక్క సారక్క దేవతల జాతరకు వేళయింది..ఈసారి జాతర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా చిత్ర విచిత్రాలు ఆశ్చర్య పరుస్తున్నాయి.. ఈసారి జాతర పూర్తిగా నారీమణుల పెత్తనంలోనే సాగనుంది.. పూర్తిగా మహిళల చేత ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు.. మంత్రి సీతక్క వినూత్న ఆలోచనతో పూర్తిగా అతివల చేత అమ్మల జాతర జరిపించేందుకు సిద్ధమయ్యారు.. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, 11 మంది డైరెక్టర్లు 1 ఎక్స్ అఫీషియ సభ్యులతో కలిసి మొత్తం 14 మందితో మేడారం ఉత్సవ కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు..

ఓరుగల్లు పేరు చెప్పగానే రాని రుద్రమదేవి పౌరుషం గుర్తుకొస్తుంది.. నారీమణుల నవశాఖానికి ఓరుగల్లు ఆడబిడ్డల పౌరుషాన్ని చిహ్నంగా భావిస్తారు.. సమ్మక్క సారక్క దేవతలను వీరవనితలుగా.. ధీరత్వానికి.. పౌరుషానికి.. ప్రతీకలుగా కొలుస్తారు.. పాలకుల ప్రయోగంతో ఓరుగల్లు స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది.. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా అంతా అతివల పాలనలోనే కొనసాగుతుంది.. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులు ఉండగా ఆ ఇద్దరు కొండా సురేఖ, సీతక్క వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినవారే కావడం విశేషం…

వీళ్ళిద్దరు మాత్రమే కాదు.. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు గా డాక్టర్ కడియం కావ్య, వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు.. వరంగల్ కలెక్టర్ గా సత్యశారదాదేవి, హనుమకొండ కలెక్టర్ గా స్నేహ శబరిష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహత్ వాజ్ పాయ్, వరంగల్ సెంట్రల్ జోన్ పోలీస్ కమిషనర్ గా సరిత స్త్రీ శక్తిని చాటుతున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా నవశకానికి నాంది పలికిన మంత్రి సీతక్క మేడారం జాతరలో ఓ వినూత్న ప్రయత్నం చేశారు.. మేడారం జాతర ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే కట్ట బెట్టారు.. చైర్ పర్సన్ గా ఇరుప స్వరూపతో పాటు మరో 12 మంది మహిళా డైరెక్టర్లు, ఒకరు ఎక్స్ అఫీషియా సభ్యుడి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అతివల బాధ్యతల స్వీకరణ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.. ధీరత్వానికి ప్రతీకగా కొలబడే సమ్మక్క సారక్క దేవతలే నారేమణులకు స్ఫూర్తి అంటున్న మంత్రి సీతక్క.. ఈసారి పూర్తిగా మహిళల చేతుల మీదుగా జాతర బాధ్యతలు నిర్వహించడం ఓ వరంగా భావిస్తున్నారు.. సమ్మక్క సారక్క దేవతల స్పూర్తితో జాతర నిర్వహణలో స్త్రీ శక్తిని చాటుతామన్నారు..

రాష్ట్రంలో ఎక్కడా.. ఎప్పుడు కని విని ఎరుగని విధంగా పూర్తిగా మహిళలకే పరిపాలన పగ్గాలు అప్పచెప్పి..ఇంత పెద్ద జాతర నిర్వహణ వారి భుజస్కందాలపై పెట్టడం చర్చగా మారింది.. శ్రీ శక్తిని నిరూపించుకునే గొప్ప అవకాశం లభించిందని తమకు లభించిందనీ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ చైర్ పర్సన్ తో సహా డైరెక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

మేడారం జాతర చరిత్రలో ఇప్పటికే అనేక అద్భుతాలు అబ్బుర పరుస్తుండగా.. తాజాగా నారీమణుల చేతికి పరిపాలన పగ్గాలు అప్ప చెప్పడం మరింత చర్చగా మారింది.. ఇంతపెద్ద జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాలపై వేసుకున్న అతివలు సమ్మక్క సారక్క స్ఫూర్తితో సక్సెస్ చేస్తారని ఆశిద్దాం.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..