Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి

Sammakka Saralamma Jatara: ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసం మహాసమ్మేళనంగా ప్రసిద్ది చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి....

Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి
Medaram Jathara

Updated on: Apr 25, 2021 | 6:20 PM

Sammakka Saralamma Jatara: ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసం మహాసమ్మేళనంగా ప్రసిద్ది చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. మాఘమాసంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాజాతరను నిర్వహించనున్నారు.2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీనలు ఆలయ పూజరులు ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 తేదీ వరకు ఈ జాతర నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.

2022లో జరిగే జాతర తేదీలు ఇవే..

► ఫిబ్రవరి 16 – సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు.
► ఫిబ్రవరి 17 – చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు.
► ఫిబ్రవరి 18 – సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం.
► ఫిబ్రవరి 19 – వన ప్రవేశం, మహా జాతర ముగింపు.

కాగా, మరో వైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మేడారం పూజారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి 15వ తేదీ వరకు మేడారం అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు.

కాగా, భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే. జాతర ముగిసే వరకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2 కోట్లకుపైగా భక్తులు హాజరుతారని అంచనా. కాగా, ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల్లో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. అయితే ఈ పండగను 2014లో రాష్ట్ర పండగుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మహా జాతరకు తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా ఒడిశా, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.

ఇవీ చదవండి:

తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న

పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం