Medak: పసి పిల్లోడురా.. అలా ఎలా కొట్టాలనిపించిందిరా దుర్మార్గుడా..?
వీడ్ని మనిషి అనాలా.. పశువు అనాలా.. అంతకంటే దారుణమైన పేర్లు ఇంకేం పెట్టాలో మీరే చెప్పండి. అభం శుభం తెలియని చిన్నోడ్ని గొడ్డును బాదినట్లు బాదాడు. బాలుడి శరీరంపై ఆ గాయాలు చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుంది. కేవలం భార్య.. మొదటి పెళ్లి సంబంధానికి పుట్టాడన్న కారణంతో...

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలుడిపై అమానుషంగా దాడి చేశాడు. అక్కన్నపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ, తన రెండో భార్య శ్వేతతో తగాదా పడి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె మొదటి పెళ్లి నుంచి పుట్టిన కుమారుడు వంశీపై తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. “ఈ పిల్లాడు నాకు పుట్టలేదు… నేనెందుకు పోషించాలి?” అంటూ మద్యం మత్తులో విచక్షణారహితంగా వంశీని తీవ్రంగా కొట్టాడని స్థానికులు తెలిపారు.
దాడితో చిన్నోడి శరీరంపై బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే తల్లి శ్వేత వంశీని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. పిల్లాడి పట్ల జరిగిన ఈ అమానుష వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మద్యం మత్తులో ఇంత దారుణంగా వ్యవహరించిన వీడ్ని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




