Telangana: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా తెలంగాణ ప్రజలంతా ఈరోజు సామూహిక జాతీయ గీతాలాపన జనగణమన పాడాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 11గంటల30 నిమిషాలకు ఈకార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని అబిడ్స్ లోని జనరల్ పోస్టాఫీస్ సర్కిల్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రయివేటు సంస్థలు తదితర ప్రదేశాల్లో ఈకార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రహదారులపై ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా 11.30కి సామూహిక జనగణమన ఆలపించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈకార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను పోలీస్ శాఖకు అప్పగించింది. సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం కోసం హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటుచేశారు. ఈవేదికల వద్ద స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు, జనగణమన పాడేందుకు వీలుగా మైకులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
Render the National Anthem in Mass Number to demonstrate our pride in celebrating the 75th anniversary of Independence Day.
Join us for a mass recitation of the national anthem on August 16th at 11:30 a.m.#StandTogether #NationalAnthem #MassRecitation #TelanganaPolice pic.twitter.com/H0dWKVqndR
— Telangana State Police (@TelanganaCOPs) August 15, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..