Telangana: తెల్లారితే తమ్ముడికి, ఆడపడుచుకి పెళ్లి.. ఊహించని పని చేసిన వివాహిత

|

Mar 21, 2022 | 1:05 PM

భర్త చెల్లెలితో తన తమ్ముడి పెళ్లి ఇష్టం లేని ఓ వివాహిత జీవితాన్ని అర్థాంతరంగా ముగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పెళ్లి వద్దని పుట్టింట్లో, అత్తగారింట్లో చెప్పినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Telangana: తెల్లారితే తమ్ముడికి, ఆడపడుచుకి పెళ్లి.. ఊహించని పని చేసిన వివాహిత
Representative image
Follow us on

Crime News: భర్త చెల్లెలితో తన తమ్ముడి పెళ్లి ఇష్టం లేని ఓ వివాహిత జీవితాన్ని అర్థాంతరంగా ముగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పెళ్లి వద్దని పుట్టింట్లో, అత్తగారింట్లో చెప్పినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఆమె ఆత్మహత్య చేసుకుంది.  ఈ విషాద ఘటన ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కనార్‌గావ్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… ఆసిఫాబాద్ మండలం(Asifabad Mandal) అడ గ్రామానికి చెందిన నగోసే గణపతికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులున్నారు. వీరిలో పెద్ద బిడ్డ తానుబాయి (32)ని కనార్‌గావ్‌కు చెందిన వడై గౌరయ్యకి ఇచ్చి కొద్ది సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు బిడ్డలున్నారు. అయితే తానుబాయి సోదరుడు మునీశ్వర్‌కు ఆమె ఆడపడుచు(భర్త చెల్లెలు) జిజాబాయితో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అయితే ఈ పెళ్ళి వద్దని తానుబాయి ఇరు కుటుంబాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాట ఎవరూ పట్టించుకోలేదు. పైగా తిరిగి ఆమెకే సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తానుబాయి మాటలు వినకుండా ఆదివారం పెళ్లి జరిపేందుకు ముహూర్తం పెట్టించారు. దీంతో శనివారం కనర్‌గావ్‌లో ఇరు కుటుంబాల వాళ్లు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని డిసైడయిన తానుబాయి.. శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతుండగానే.. పరిస్థితి విషమించి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  ఇంకా గృహప్రవేశం కూడా అవ్వని ఇంట్లో దొంగతనం.. ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే మైండ్ బ్లాంక్

బార్డర్ వద్ద అనుమానాస్పదంగా డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు