వరంగల్, ఆదిలాబాద్ ఏజెన్సీలో PLGA వారోత్సవాల కలకలం చెలరేగుతోంది. రాజకీయనాయకులను టార్గెట్ చేసిన మావోయుస్టు పార్టీ.. తాజాగా హిట్‌లిస్ట్‌ని ప్రకటించడం స్థానికంగా సంచలనంగా మారింది. విప్లవ ద్రోహులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ లేఖని విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. మావోయుస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున విడుదలైన ఈ లేఖలో వరంగల్ జిల్లాకి చెందిన ఐదుగురు రాజకీయ నేతల పేర్లు ప్రస్థావించడం స్థానికంగా కలకలం రేపుతోంది. విప్లవ ద్రోహులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని బెదిరింపులేఖలో… హెచ్చరించాడు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్.
ఏటూరునాగారం మండలంలోకాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు నాయకులు, వాజేడు మండలంలో టీఆర్‌ఎస్ కి చెందిన ఇద్దరు నాయకుల పేర్లు హిట్‌లిస్ట్‌లో ఉండడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. కాంగ్రెస్‌కి చెందిన అర్జున్, ఇర్సవడ్ల వెంకన్న, బొల్లు దేవేందర్ పేర్లు హిట్ లిస్ట్‌లో ఉన్నాయి. TRS ప్రెసిడెంట్ బుచ్చయ్య, రామకృష్ణరెడ్డి పేర్లు సైతం హిట్ లిస్ట్‌లో ఉండడం స్థానికంగా సంచలనంగా మారింది. వీరు….ఛత్తీస్‌గఢ్ లో ఇసుక వ్యాపారం చేస్తూ, ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ లేఖలో ఆరోపించారు మావోయిస్టులు.
PLGA వారోత్సవాలతో మావోయుస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. వరంగల్, ఆదిలాబాద్ గోదావరీ తీర ప్రాంతంలో మావోయుస్టుల కలకలం చెలరేగడంతో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని రాచర్ల గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్ ప్రారంభించారు… సరైన ధ్రువపత్రాలు లేని 21 మోటార్ సైకిళ్ళను పోలీసులు సీజ్ చేశారు. గ్రామంలో సోదాలు నిర్వహించి, మావోయిస్టులకు సహకరించవద్దని సూచించారు పోలీసులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం