AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అలర్ట్.. గ్యాస్ సబ్సిడీ రావాలంటే ఈ పని తప్పక చేయాల్సిందే..

గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ముఖ్యమైన విషయం చెప్పాయి. సబ్సిడీ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం E-KYC చేయిస్తేనే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మీకు వస్తుంది. మీరు E-KYC పూర్తి చేయకపోతే.. సబ్సిడీ ఆగిపోతుంది. దీనికి చివరి తేదీ, ఎలా చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం..

Telangana: అలర్ట్.. గ్యాస్ సబ్సిడీ రావాలంటే ఈ పని తప్పక చేయాల్సిందే..
Gas Subsidy E Kyc
Krishna S
|

Updated on: Oct 31, 2025 | 9:30 AM

Share

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. సబ్సిడీని కొనసాగించుకోవాలంటే ప్రతి ఏటా ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని వినియోగదారులను కోరుతున్నాయి.

E-KYC ఎందుకు చేయాలి..?

గ్యాస్ వినియోగదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవడం తప్పనిసరి. కేంద్రం ఏడాదికి గరిష్టంగా 9 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తోంది. అయితే కస్టమర్లు బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయనంత వరకు, 8వ, 9వ రీఫిల్‌లకు సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం నిలిపివేస్తుంది. మార్చి 31వ తేదీలోపు E-KYC ప్రక్రియను పూర్తి చేస్తే.. నిలిపివేసిన సబ్సిడీ డబ్బును తిరిగి వినియోగదారులకు చెల్లిస్తారు. లేదంటే ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయకపోయినా గ్యాస్ సరఫరా మాత్రం నిలిచిపోదు. కానీ సబ్సిడీ రాదు.

E-KYC పూర్తిచేసే విధానాలు

ఈ సేవలు వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకుని E-KYC పూర్తి చేయవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా: ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ లేదా భారత్ పెట్రోలియం వంటి సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ ద్వారా: మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు నేరుగా వెళ్లి.. గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని వెంటనే E-KYC పూర్తి చేయాలని వినియోగదారులకు సూచించారు.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ అయిన http://www.pmuy.gov.in/e-kyc.html ను సంప్రదించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే