అక్టోబర్ 31 రాశి ఫలాలు: వారికి పట్టిందల్లా బంగారమే.. ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు!
Horoscope Today (October 31, 2026): శనివారంనాడు మేష రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దిన ఫలాలు (అక్టోబర్ 31, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికం కూడా స్థిరత్వం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, కుజుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కొత్త పద్ధ తులు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. కుటుంబ పెద్దల సహకారంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపుతో పాటు, కెరీర్ పరంగా తగిన పురోగతి లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
దశమ స్థానంలో రాహువు, లాభ స్థానంలో శనైశ్చరుడు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితం మూడు పూవులు ఆరుకాయలుగా సాగిపోతుంది. ఆస్తి వ్యవహారం ఒకటి సానుకూలపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువర్గం నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో శుక్ర, బుధులు, ధన స్థానంలో గురువు వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికం కూడా స్థిరత్వం కల్పిస్తారు. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అంచనాలకు మించి పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండవు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కుటుంబసమేతంగా ఆధ్మాత్మిక సేవల్లో పాల్గొంటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల, ఆదాయంలో కొద్దో గొప్పో పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదు. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా, సామ రస్యంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా సానుకూలపడుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
తృతీయ స్థానంలో శుక్ర, బుధులతో పాటు రాశ్యధిపతి రవి కూడా ఉన్నందువల్ల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. కొద్దిపాటి పురోగతి కూడా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడంమంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో శుక్రుడితో కలిసి బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదు. ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. లాభ స్థానంలో ఉన్న గురు, కుజుల కారణంగా ప్రభుత్వపరంగా ఆశించిన ప్రయోజనాలుంటాయి. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశిలో శుక్ర, రవి, బుధులు, దశమ స్థానంలో కుజ, గురువుల సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో మార్పులు తీసుకు వచ్చి భారీగా ప్రయోజనం పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికా రులతో అధికారాలను, బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు విదేశాల్లో స్థిరపడే సూచనలున్నాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా శుభపరిణామం చోటు చేసుకుంటుంది. జీతభత్యాల్లో మార్పులు ఉండకపోవచ్చు కానీ, అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడు, గురువు ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని రాణింపు ఉంటుంది. వ్యాపారాల తీరుతెన్నులు మారిపో తాయి. లాభాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. పరిచయస్థుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయ స్థానంలో రాహువు, లాభ స్థానంలో రవి, బుధ, శుక్రులు సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి లోటుండదు. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దైవ కార్యాల్లో పాల్గొం టారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, కుజులు, దశమ స్థానంలో రవి, శుక్ర, బుధులు ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సాను కూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతానికి దానధర్మాలను తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానంలో ఉన్న శనీశ్వరుడు వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. భాగ్య స్థానంలో ఉన్న శుక్ర, బుధ, రవుల కారణంగా ఆశించిన ఉత్తమ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యో గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువు, అదే రాశిలో ఉన్న కుజుడు తప్ప కుండా వృత్తి, ఉద్యోగాల్లో పురోగతినిస్తారు. ఆకస్మిక అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది.



