Telangana: అనుమానం పెనుభూతమైంది.. తీవ్రంగా కొట్టడంతో

శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో,అనురాధ క్యాటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. కొద్దిరోజులుగా భార్య పైన అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ తరచూ గొడవలు పడేవాడని, గత నెల 26వ తేదీన ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana:  అనుమానం పెనుభూతమైంది.. తీవ్రంగా కొట్టడంతో
Anuradha

Updated on: Mar 03, 2025 | 5:09 PM

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో ఆమెను భర్త తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె చనిపోయింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ దారుణం. ఏదులాబాద్ గ్రామంలో నివాసముంటున్న శ్రీనివాస్‌, అతని భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రాత్రి మళ్లీ గొడవ జరగగా.. కోపంలో భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహా కోల్పోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. స్థానికులను అడగగా.. భార్యాభర్తల తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.