Watch Video: కోతులను తరిమి కొట్టిన చింపాంజీ.. ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు..

జిల్లాలో కోతుల బెడద అంతా ఇంతా కాదు. వ్యవసాయ పొలాలు, పండ్ల తోటలు, కూరగాయలు అన్నిటినీ నష్టం కలిగిస్తున్నాయి. పొలాల దగ్గర మనుషులే కాపలా ఉండి కోతుల బెడద నుంచి పంటలను కాపాడు కుంటున్నారు. వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రైతులు. జనావాసాలు, షాపులు, ఇళ్లల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అంతే కాదు ఈ మధ్య కాలంలో మనుషులపై దాడి చేసి గాయపర్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడం, అటవీప్రాంతం ఎక్కువగా ఉండడం, తాగేందుకు సరిగా నీరు లేకపోవడంతో కోతులు పల్లెలు ,పట్నాలవైపు చూస్తున్నాయి.

Watch Video: కోతులను తరిమి కొట్టిన చింపాంజీ.. ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు..
Khammam District
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 10, 2024 | 10:36 AM

జిల్లాలో కోతుల బెడద అంతా ఇంతా కాదు. వ్యవసాయ పొలాలు, పండ్ల తోటలు, కూరగాయలు అన్నిటినీ నష్టం కలిగిస్తున్నాయి. పొలాల దగ్గర మనుషులే కాపలా ఉండి కోతుల బెడద నుంచి పంటలను కాపాడు కుంటున్నారు. వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రైతులు. జనావాసాలు, షాపులు, ఇళ్లల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అంతే కాదు ఈ మధ్య కాలంలో మనుషులపై దాడి చేసి గాయపర్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడం, అటవీప్రాంతం ఎక్కువగా ఉండడం, తాగేందుకు సరిగా నీరు లేకపోవడంతో కోతులు పల్లెలు ,పట్నాలవైపు చూస్తున్నాయి. ఇటు పిల్లలను, అటు పెద్దలను, వృద్ధులను కరవడం పరిపాటి అయిపోయింది. దీనికి తోడుగా ఇళ్లలోని వస్తువులను చిందర వందర చేసి ఇంట్లో ఉన్న వ్యక్తులను గాయపరిచి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అలాగే పెరటిలోని మొక్కలను జామకాయ, మామిడి, నారెంజ చెట్లను నాశనం చేస్తున్నాయి.

వీటి బెడద నుంచి కాపాడు కోవడానికి ఈ గ్రామస్థులు వినూత్న ప్రయత్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రవికంపాడు పంచాయతీ సెక్రెటరీ కిరణ్ కుమార్‎కు అరుదైన ఆలోచన రావడంతో చింపాంజీతో కోతులు భయపడతాయి అని తెలిసి కార్యాలయ సిబ్బందికి చింపాంజీ వేషధారణ ధరించి గ్రామంలో వాడ వాడ తిప్పారు. ఈ వేషధారణలో ఉన్న వ్యక్తి కోతులను బెదిరించడంతో అవి పారిపోతున్నాయి. కోతులు కొంతవరకు బయటికి వెళ్ళిపోవడంతో గ్రామ ప్రజలకు ఉపశమనం కలిగిందని చెబుతున్నారు. ఇలా చింపాంజీ వేషంలో తిరుగుతూ కోతుల ఆట కట్టిస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా కలగని ఉపశమనం ఈ ఐడియాతో సఫలం అయిందంటున్నారు స్థానికులు. పంచాయతీ సెక్రెటరీ కిరణ్ కుమార్‎కు వచ్చిన ఆలోచనతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకొని హమ్మయ్య అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్