Telangana: ఈయన మాములోడు కాదు.. సింపుల్‌గా 100 కోట్లు కొల్లగొట్టాడు.. ఎలాగంటే..?

ఓ మాయగాడు సినిమాని తలపించే విధంగా ఆర్థిక‌ నేరాలకి పాల్పడ్డాడు. ఒకరికి తెలియకుండా మరోకరిని మోసం చేస్తూ వందకొట్ల రూపాయల వరకు కొల్లగొట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ లో వెల్లడైంది. క్రిప్టో కరెన్సీ‌ పేరుతో భారీ మోసాలకి పాల్పడ్డాడు ఈ ప్రబుద్ధుడు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: ఈయన మాములోడు కాదు.. సింపుల్‌గా 100 కోట్లు కొల్లగొట్టాడు.. ఎలాగంటే..?
Ramesh Goud

Edited By: Ram Naramaneni

Updated on: Feb 03, 2025 | 1:06 PM

జనగామ జిల్లా లింగాల ఘన్‌‌పూర్‌ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెదక్, వరంగల్‌ జిల్లాలలో క్రిప్టో కరెన్సీ పేరుతో దందా మొదలుపెట్టాడు ఈ కేటగాడు.  ఇందుకోసం జిబిఆర్ పేరిట నకీలీ వెబ్ సైట్ కూడా రూపొందిచాడు. అందులో క్రిప్టో‌కరెన్సీ ద్వారా లాభాలు ‌పొందవచ్చని అమాయకులని నమ్మించాడు. ఇందుకోసం కొత్త కొత్త వాట్సప్ గ్రూపులు క్రియేటివ్ చేసాడు. ఆ గ్రూపులో చేరినవారికి లాభాలు వచ్చే విధంగా ఫ్లాన్ చేశాడు. అంతేకాదు  తన గ్రూపులో ముందుగా చేరినవారిని సింగపూర్, గోవా, దుబాయ్ లాంటి ఇతర దేశాలకి విహారయాత్రకు తీసుకెళ్ళాడు.వారికి ఖరిదైన  కానుకలు ఇచ్చాడు.

దీంతో  లాభాలు వచ్చిన వ్యక్తులు తమ మిత్రులని కుడా ఈ గ్రూపులలో చేర్పించారు. తాను ఇచ్చిన గిఫ్ట్స్ గురించి కూడా వాట్సప్ గ్రూపులో వైరల్ చేసేవాడు. దీంతో చాలామంది ‌కూడ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడ రమేష్ గౌడ్ బాధితులు‌ ఉన్నారు. బాధితుల దగ్గర నుంచి సేకరించిన డబ్బులతో దుబాయ్‌లో భారీగా‌ అస్తులని కొనుగోలు చేశాడు. వన్ ఫైన్ డే దుకాణం ఎత్తేసి స్థిరపడేందుకి‌ ప్లాన్ చేసాడు.. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్‌లో కరీంనగర్ చెందిన ఇద్దరు వ్యక్తులకి ఇతగాడి ప్రవర్తనపై అనుమానం కలిగింది. దీంతో వారు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. ఈ కేసును సిఐడి పోలీసులు టేకప్ చేశారు. అయితే విచారణ సమయంలో పోలిసులు మధ్య పెట్టేందుకు రమేష్ గౌడ్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీగా డబ్బులు సంపాందించినా వాటిని గుర్తించడంలో సిఐడి పోలిసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికంగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా పోలిసుల విచారణ జాప్యంపైనా బాధితులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. జనవరి‌14 తేదీన నిందితుడ్ని హైదరాబాదులో‌ అరెస్టు చేసి రిమాండ్‌కి పంపారు పోలీసులు.

అయితే వంద కొట్ల వరకు ఆస్తుల కూడబెట్టిన అంశంలో పోలీసుల విచారణ సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ రమేష్ గౌడ్ వలలో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉన్నత అధికారులే చిక్కుకున్నారట. వారు భారీగా‌ పెట్టుబడులు పెట్టి బయటికి రావాడానికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. బాధితులు తమ డబ్బులు ఇప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..