Sankranti Special Trains: సంక్రాంతి నేపధ్యంలో ఈ నెల 16 నుంచి 18 వరకూ వివిధ మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్.. వివరాల్లోకి వెళ్తే..

Sankranti Special Trains: తెలుగువారి పెద్ద పండగను తమ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి భాగ్య నగరం(Hyderabad) పల్లె బాటపట్టింది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్టూడెంట్స్ ,..

Sankranti Special Trains: సంక్రాంతి నేపధ్యంలో ఈ నెల 16 నుంచి 18 వరకూ వివిధ మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్.. వివరాల్లోకి వెళ్తే..
Sankranti Special Trains

Updated on: Jan 15, 2022 | 10:38 AM

Sankranti Special Trains: తెలుగువారి పెద్ద పండగను తమ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి భాగ్య నగరం(Hyderabad) పల్లె బాటపట్టింది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్టూడెంట్స్ , బతుకుదెరువు కోసం పట్నంలో ఉన్నవారందరూ తమ సొంత ఊళ్లలో పండగను జరుపుకోవడానికి వెళ్లారు. దీంతో  బస్సులు, రైళ్ళు ఇలా ప్రయాణ సాధనాల్లో రద్ది నెలకొంది. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా పండగను జరుపుకున్న తర్వాత .. ఆ స్వీట్ మెమరీస్ ను నేమరవేసుకుంటూ.. మళ్ళీ జీవిత పోరాటం కోసం తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. ఈ నేపధ్యంలో ఈనెల 16, 17, 18, 19 తేదీల్లో వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించడానికి రైల్వే అధికారులు రెడీ అయ్యారు. పలు ప్రత్యెక ట్రైన్స్ ను సిద్ధం చేసినట్లు సీపీఆర్‌ఓ రాకేష్‌ చెప్పారు.

ఈనెల 16న కాకినాడటౌన్‌-సికింద్రాబాద్‌ (నంబర్‌ 82727) సువిధ స్పెషల్‌ ట్రైన్ ను నడపనుండగా17న కాకినాడటౌన్‌-సికింద్రాబాద్‌(నంబర్‌ 07539) ఈ నెల 18న కాకినాడటౌన్‌-సికింద్రాబాద్‌(07537) ప్రత్యెక రైళ్ళను నడపనున్నారు.

రేపు, 18 తేదీలో నర్సాపూర్‌-వికారాబాద్‌ (07496) వన్‌ వేను రైల్వే అధికారులు నడపనున్నారు.

ఈ నెల 17, 19 తేదీల్లో , మచిలీపట్నం-సికింద్రాబాద్‌ (07298) ట్రైన్ నడపనున్నారు.

ఈ నెల 17న నర్సాపూర్‌-వికారాబాద్‌ (07089 నంబర్‌ జన్‌సాధారణ్‌ స్పెషల్‌ ను నడపనున్నారు.

రేపు అనకాపల్లి-సికింద్రాబాద్‌ (07436 నంబర్‌ జన్‌సాధారణ్‌ స్పెషల్‌ ట్రైన్ ను ఈ నెల 17తేదీన తిరుపతి-సికింద్రాబాద్‌(07437 జన్‌సాధారణ్‌ స్పెషల్) ను నడపనున్నామని రాకేశ్ చెప్పారు.

Also Read :

 హైదరాబాద్ లో ట్రాక్ మరమత్తు పనులు.. నేడు, రేపు పలు ఎంఎంటిఎస్ రైళ్ళు రద్దు,

హెచ్‌ఐవీ సోకిన విషయాన్ని దాచిపెట్టిన భర్త.. భార్యకు కూడా సోకిన వైరస్.. బాధితురాలు ఏం చేసిందంటే..

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..