
అత్త మీద కోపం గిత్త మీద చూపెట్టినట్టు అత్త మీద కోపం అల్లునికి శాపంగా మారింది ..ఇదేమైనా సామెత అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే . రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అత్యంత కీలక పరిణామాల్లో ఇదొక కీలక విషయంగా చెప్పుకోవచ్చు. నైఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన 105 స్థానాల్లో టికెట్ దక్కని ఖానాపూర్ ప్రస్తుత బీహార్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అల్లుడు సంబంధించిన విషయం ఇది. ఖానాపూర్ నైఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈసారి భూక్యా జాన్సన్ రాథోడ్ కి టికెట్ కేటాయిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ..ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రేఖా శ్యామ్ నాయక్ టికెట్ లేదని ఆయన ప్రకటించారు . దీంతో మరొక 40 రోజులపాటు తాను బీఆర్ఎస్ లో కొనసాగుతానని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే రేఖ శాం నాయక్ ప్రకటించారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థన కూడా చేసుకున్నారు. ఇప్పటికే ఆమె భర్త కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగా ఈమె కూడా త్వరలోనే తన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అంటూ ఉదయం స్టేట్మెంట్ ఇచ్చింది . ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన గంటసేపటికి ఆమె అల్లుడు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శరత్ చంద్ర పవర్ ని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అత్త కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన గంటలోనే తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఆమె కూతుర్ని చేసుకున్న ఐపీఎస్ శరత్చంద్ర పవార్ మహబూబాద్ ఎస్పీగా ఉన్న అతన్ని బదిలీ చేసి తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేసింది . దీంతో అత్త మీద కోపం అల్లూరి మీద పెట్టినట్టుగా అయిపోయింది
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..