మహబూబాబాద్‌లో పోలీసులు ఓవర్ యాక్షన్‌పై ప్రజలు తిరగబడ్డారు. హెల్మెట్ పెట్టుకోలేదని వాహనదారులపై పోలీసులు ఝులం ప్రదర్శించారు. హెల్మెట్ పెట్టుకోలేదని వాహనదారులను విచక్షణా రహితంగా కొట్టారు. చంటి పిల్లలతో వెళ్తున్న తల్లిదండ్రులను కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. కూరగాయల ఇంటి నుంచి బయటకు వచ్చినా అని చెప్పిన వినకుండా కూతురు మందే కొట్టారని ఓ తండ్రి వాపోయాడు. పోలీసులు ఓవర్ యాక్షన్‌పై వాహనదారులు తిరగబ్డారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై భైఠాయించారు. ఎలాంటి అవగాహన కల్పించకుండా.. హెల్మెట్ పెట్టుకోవాలని రూల్స్ గుర్తు చేయకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టి వాహనాలు సీజ్ చేస్తున్నారని వాహనదారులు మండిపడ్డారు.
ఏం జరిగిదంటే..
మానుకోటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాస్క్, హెల్మెట్ తప్పనిసరి అంటూ ఆదివారం మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్నవారిని స్పెషల్ డ్రైవ్ పేరుతో అడ్డుకున్నారు. కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా శ్రీనివాస్ అనే ద్విచక్రవాహనదారుడిని ఆపిన పోలీసులు.. అతని బండి తాళాలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని అడిగితే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారని తిట్టరని.. ఫైన్ కడుతానని చెప్పినా వినిపించుకోకుండా విపరీతంగా కొట్టారని బాధితుడు వాపోయాడు. శ్రీనివాస్‌ను పోలీసులు కొడుతున్న సమయంలో పక్కనే ఉన్న అతని కూతురు కొట్టొద్దని వేడుకున్నా వదలకుండా కొట్టారని స్థానికులు ఆరోపించారు.
“హెల్మెట్” ఎందుకు వాడతారు?
హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ఇది తలని రక్షిస్తుంది.. గాయాలను తగ్గిస్తుంది. హెల్మెట్ ధరించడం వల్ల హిట్ హెడ్ జరగకుండా కాపాడుతుంది. హెల్మెట్ లేని వ్యక్తి తల నేలకు తగిలితే మెదడు ఉబ్బి రక్తస్రావం అవుతుంది. పెద్ద ప్రమాదాలను నివారించండి సాధ్యమవుతుంది. ప్రమాద మరణాల స్థాయిని బాగా తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..