Holi 2022: హోలీ వేడుకల్లో రంగులతో పాటు మందు.. నోటి నోటికీ లిక్కర్ సప్లై చేసిన MLA శంకర్‌ నాయక్‌

|

Mar 18, 2022 | 1:58 PM

హోలీ సందర్భంగా రంగులు చల్లుకోవచ్చు. కానీ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాత్రం మందు కూడా చల్లారు. బాటిళ్లకు బాటిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు గానీ.. హోలీ రంగులతో పాటు లిక్కరూ సప్లై చేశారు.

Holi 2022: హోలీ వేడుకల్లో రంగులతో పాటు మందు.. నోటి నోటికీ లిక్కర్ సప్లై చేసిన MLA శంకర్‌ నాయక్‌
Mla Shankar Nayak
Follow us on

హోలీ(Holi 2022) సందర్భంగా రంగులు చల్లుకోవచ్చు. కానీ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌(MLA Shankar Nayak) మాత్రం మందు కూడా చల్లారు. బాటిళ్లకు బాటిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు గానీ.. హోలీ రంగులతో పాటు లిక్కరూ సప్లై చేశారు. ఆ సప్లై కూడా తెరవరా నోరు.. పోయరా మందు అన్నట్టు ఉంది. కొందరు కార్యకర్తలకు ఆప్యాయంగా ఆయనే నోట్లో లిక్కర్‌ పోస్తూ కనిపించారు. ఇంకొందరు కార్యకర్తలకు బాటిళ్లు పంచిపెట్టారు. సో ఈ హోలీ వేళ.. ఇది MLA శంకర్ నాయక్ మందు పంపిణీ పథకం అన్నమాట. హోలీ పండగ అనగానే శంకర్ నాయక్ కార్యకర్తలతో బ్రహ్మాండంగా సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టారు. రంగులు చల్లారు.. చల్లించుకున్నారు. ఆప్యాయంగా అందర్నీ పలకరించారు. ఇంతవరకూ బాగానే ఉంది.

కానీ ఈ మొత్తం సెలబ్రేషన్స్‌లో లిక్కర్ లేకపోవడం లోటుగా అనిపించిందో ఏమో గానీ.. రంగులకు కిక్కును యాడ్ చేశారు. కార్యకర్తలకు మందును పంచారు.. తాగించారు.. సందడి చేశారు. విషయం ఏంటంటే హోలీ వేళ వైన్స్‌ను క్లోజ్ చేసింది ప్రభుత్వం. రెండురోజులు అమ్మకాలు నిషేధించింది.

ఇదిలావుంటే.. హైదరాబాద్‌లో హోలీ సంబరాలు కలర్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. గల్లీ గల్లీల్లో సందడి కనిపిస్తోంది. ఇందిరాపార్క్‌ లో ఏర్పాటుచేసిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని.. డాన్స్‌ చేసి యూత్‌లో జోష్‌ పెంచారు. పలువురు మంత్రులు, నేతలు, అధికారులు కుటుంబసభ్యులతో కలిసి పండుగ చేసుకున్నారు.

డీజే సౌండ్స్‌ మధ్య కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు నగర యూత్‌. రెండేళ్లుగా కరోనాతో పండుగ జరుపుకోలేకపోయామని..కానీ ఈసారి మాత్రం ఫుల్‌ జోష్‌లో జరుపుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.

Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..