
మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బిల్డింగ్ పై ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడూ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు.. కానీ అక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. ఆ బిల్డింగ్ పై నుంచి పడినా.. ఆ బాలుడు మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. అది ఎలా సాధ్యం అయిందంటే.. అతను బల్డింగ్ పై నుంచి కింద పడే క్రమంలో టెంట్‌పై పడిపోయాడు. దీంతో ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు.
వివరాల్లోకి వెళ్తే.. కేసముద్రం మండలం గర్ని తండాకు చెందిన బానోత్ గణేష్ – కల్యాణి దంపతుల గ్రితీష్ అనే 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గ్రీతీష్ బల్డింగ్‌పై ఆడుకుంటూ అనుకోకుండా పై నుంచి జారి పడిపోయాడు. అదృష్టవశాత్తు బిల్డింగ్ కింద టెంట్ వేయడంతో ఆ బాలుడు టెంట్‌పై పడిపోయాడు. పడిన వెంటనే బాలుడు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే టెంట్‌పై నుంచి బాలుడిని కిందకు దించారు.
పై నుంచి పడిపోయినా బాలుడికి ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయ్యప్ప పూజ కోసం వేసిన టెంట్‌పై పిల్లాడు పడి ప్రాణాలు దక్కడంతో.. ఇదంతా ఆ దేవుడి మహిమే అని స్థానికులు చెబుతున్నారు. ఆ అయ్యప్ప స్వామీనే బాబును కాపాడాడని అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.