Madhapur Inspector: వివాదంలో మాదాపూర్‌ సీఐ గడ్డం మల్లేష్‌.. రూల్స్ బ్రేక్ చేసి, కేబుల్ బ్రిడ్జ్‌‌పై బర్త్‌ డే వేడుకలు!

గతంలో మాదాపూర్‌ సీఐ మల్లేష్‌ పలుమార్లు ప్రకటించారు. కేబుల్‌ బ్రిడ్జిపై పార్టీలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేశారు. కానీ.. ఇప్పుడు అదే నిబంధనలు ఉల్లంఘించి.. కేబుల్‌ బ్రిడ్జిపై మాదాపూర్‌ సీఐ మల్లేష్‌.. బర్త్‌ డే పార్టీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Madhapur Inspector: వివాదంలో మాదాపూర్‌ సీఐ గడ్డం మల్లేష్‌.. రూల్స్ బ్రేక్ చేసి, కేబుల్ బ్రిడ్జ్‌‌పై బర్త్‌ డే వేడుకలు!
Madapur Inspector Gaddam Mallesh

Edited By:

Updated on: May 05, 2024 | 1:50 PM

హైదరాబాద్‌ మాదాపూర్‌ సీఐ గడ్డం మల్లేష్‌ వివాదంలో ఇరుక్కున్నారు. కేబుల్‌ బ్రిడ్జ్‌ దగ్గర నిర్వహించిన తన బర్త్‌ డే పార్టీలో పాల్గొని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. కేబుల్‌ బ్రిడ్జిపై బర్త్‌డే పార్టీలు నిషేధం అంటూ గతంలో మాదాపూర్‌ సీఐ మల్లేష్‌ పలుమార్లు ప్రకటించారు. కేబుల్‌ బ్రిడ్జిపై పార్టీలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేశారు. కానీ.. ఇప్పుడు అదే నిబంధనలు ఉల్లంఘించి.. కేబుల్‌ బ్రిడ్జిపై మాదాపూర్‌ సీఐ మల్లేష్‌.. బర్త్‌ డే పార్టీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కేబుల్ బ్రిడ్జిపై స్వయాన మాదాపూర్ సీఐ మల్లేశ్ నిబంధనలు ఉల్లంఘించారు. బ్రిడ్జిపై ఎవ్వరూ బర్త్ డే వేడుకలు చేయొద్దని హెచ్చరికలు చేసిన ఆయన.. అదే కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే సెలబ్రేషన్లలో పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిస సీఐపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలో పాల్గొన్న సీఐకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలను చూసిన ప్రజలు సీఐగారూ.. ఇదేం పని అండీ అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు కేవలం మాకేనా? మీకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీస్తున్నారు.

గతంలో సీఐ మల్లేశ్ అవగాహన కార్యక్రమం మీరే చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..