Charminar: చార్మినార్‌పై గలీజ్ పనులు.. అందరి ముందే రెచ్చిపోతున్న లవర్స్.. సీసీకెమెరాలో విజువల్స్ రికార్డ్, పోలీసుల సీరియస్..

హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ భారత్‌లోని ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటి. హైదరాబాద్‌కు వచ్చిన పర్యాటకులు ఎవరైనా తప్పక చూడాల్సిన మహాద్భుతమైన కట్టడం ఇది. 1591లో హైదరాబాద్‌ను పాలించిన మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్‌ను నిర్మించారు. మన హైదరాబాద్‌ నగరానికే ఇది తలమానికంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ చార్మినార్‌ ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. నిత్యం వేలాది మంది సందర్శించే ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఆ ప్రదేశంలో కొందరు చేస్తున్న పనులు టూరిస్టులకు..

Charminar: చార్మినార్‌పై గలీజ్ పనులు.. అందరి ముందే రెచ్చిపోతున్న లవర్స్.. సీసీకెమెరాలో విజువల్స్ రికార్డ్, పోలీసుల సీరియస్..
Hyderabad Charminar
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 12, 2023 | 9:48 AM

హైదరాబాద్, ఆగష్టు 12: హైదరాబాద్ అంటే చార్మినార్.. చార్మినార్ అంటే హైదరాబాద్.. ఇదీ ప్రపంచ వ్యాప్తంగా‌ మన భాగ్యనగరానికి ఉన్న గుర్తింపు. హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ భారత్‌లోని ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటి. హైదరాబాద్‌కు వచ్చిన పర్యాటకులు ఎవరైనా తప్పక చూడాల్సిన మహాద్భుతమైన కట్టడం ఇది. 1591లో హైదరాబాద్‌ను పాలించిన మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్‌ను నిర్మించారు. మన హైదరాబాద్‌ నగరానికే ఇది తలమానికంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ చార్మినార్‌ ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. నిత్యం వేలాది మంది సందర్శించే ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఆ ప్రదేశంలో కొందరు చేస్తున్న పనులు టూరిస్టులకు పాలిట శాపంగా మారుతున్నాయి. ఇది వరకు రాత్రి సమయాల్లో కూడా చార్మినార్‌కు రద్దీ తగ్గేది కాదు.. బ్యాంగిల్స్‌, ఇతర షాపులు నిత్యం కలకలలాడుతూ ఉండేవి. అయితే ఇప్పుడు అర్థరాత్రి అయితే చాలు చార్మినార్‌వైపు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు మూసివేస్తున్నారు.

కొందరు ప్రేమికులు రాత్రి సమయంలో హద్దులు మీరి ప్రవర్తించడం, చిన్న చిన్న గొడవలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి చార్మినార్‌ చూడాలని వచ్చేవారికి నిరాశ తప్పడం లేదు. ఎంతో దూరం నుంచి వచ్చి అదే దూరం నుంచి చార్మినార్‌ను చూసి చీకట్లోనే సెల్ఫీలు దిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో ఆశగా వస్తే చార్మినార్‌ను దగ్గరి నుంచి చూడలేకపోతున్నామని టూరిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కొందరు చేసిన పనులకు ఇలా తమకు ఇబ్బంది కలిగించడం సరికాదంటున్నారు.

పోలీసు అధికారులు మాత్రం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే రోడ్లను అర్థరాత్రి సమయంలో మూసివేస్తున్నామని చెబుతున్నారు. ఇటీవల చార్మినార్‌ రాత్రివేళల్లో అందంగా కనిపించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇల్యూమినేషన్‌ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. 190 వాట్స్‌ ఎల్‌ఈడీ లైట్లను సైతం అమర్చారు. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక లైట్లను ఏడాది పొడవునా వెలిగిస్తామని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. చార్మినార్‌కు కొత్త అందాలు తోడవడంతో చూసేందుకు భారీగా పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. పోలీసుల ఆంక్షలతో వారికి నిరాశ తప్పడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..