Telangana Crime: ప్రేమ పేరుతో వేధింపులు.. అది తెలిసి యువతి బంధువులు ఏం చేశారంటే..

|

Oct 22, 2021 | 5:33 AM

Telangana Crime: నిర్మల్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో యువతి వెంటపడుతున్నాడంటూ ఓ యువకుడిని యువతి తరుపు బందువులు విచక్షణా

Telangana Crime: ప్రేమ పేరుతో వేధింపులు.. అది తెలిసి యువతి బంధువులు ఏం చేశారంటే..
Harassment
Follow us on

Telangana Crime: నిర్మల్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో యువతి వెంటపడుతున్నాడంటూ ఓ యువకుడిని యువతి తరుపు బందువులు విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. చేతులు కాళ్లు కట్టేసి మరీ యువకుడిని చితకబాది చంపేసారు యువతి తరుపు బందువులు. ఈ దాడితో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని‌ సూర్జపూర్ లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. యువకుడిని హత్య చేసిన నిందితులను తమకు అప్పగించాలంటూ మృతుడి తరుపు బందువులు మృతదేహాంతో ఆందోళనకు‌ దిగారు. ఇరు వర్గాలను‌ అదుపు చేసేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దింపక తప్పలేదు.

పరువు పేరుతో అమానుషంగా దారుణ హత్యకు పాల్పడ్డ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జపుర్ గ్రామంలో చోటుచేసుకుంది. తమ కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న కారణంతో సుర్జాపూర్ గ్రామానికి చెందిన రాచర్ల అనిల్ అనే యువకుడిని, యువతి తరుపు బందువులు విచక్షణా రహితంగా కొట్టారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ మృతి చెందాడు. ఈ ఘటనతో సూర్జపూర్ లో ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారి తీసింది.

మృతుడు అనిల్‌పై గతంలోనే ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యువతి తరుపు బందువులు. యువకుడు మారక పోవడంతో యువతి తరుపు కుటుంబ సభ్యులు అనిల్ ను తాళ్లతో కట్టేసి కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. అనంతరం అక్కడే వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకోగా.. అనిల్ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. వెంటనే అనిల్‌ను ప్రైమరీ చికిత్స కొరకు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అనిల్ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

TDP vs YCP: ఏపీ గవర్నర్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్..

Hyderabad Crime: రాజేంద్ర నగర్‌లో మిస్టరీగా బాలుడు మిస్సింగ్ కేసు.. ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు..

Forest Office: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌లో భారీ దోపిడీ.. లక్షలు విలువచేసే వస్తువులు మాయం.. అది వారి పనేనా..?