Telangana: రైతు పొలం చదును చేస్తుండగా బయటపడింది చూసి.. ఒక్కసారిగా ఆశ్చర్యం..

|

Jun 24, 2024 | 4:24 PM

తొలకరి ప్రారంభం అవ్వడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. పొలాలను శుభ్రం చేసి సాగుకు సిద్దమవుతున్నారు. అయితే నారాయణ్ ఖేడ్‌లో ఓ మహిళా రైతు తన పొలాన్ని చదును చేస్తుండగా ఓ అద్భుతం వెలుగుచూసింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి...

Telangana: రైతు పొలం చదును చేస్తుండగా బయటపడింది చూసి.. ఒక్కసారిగా ఆశ్చర్యం..
Land Levelling (Representative image)
Follow us on

భూమి కంటే గొప్పది ఏముంటుంది చెప్పండి.. ఎన్ని పాపాలు చేసినా మనల్ని భరిస్తుంది. మనం తినడానికి అన్నాన్ని ఇస్తుంది. చనిపోతే… తారతమ్యాలు లేకుండా తన బోజ్జలో దాచుకుంటుంది. ఇక చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు కూడా భూమిలో కలిసిపోయాయి. ఎప్పుడైనా తవ్వకాలు జరపుతుండగా.. పురాతన కాలం నాటి వజ్రాలు, వివిధ రాజుల కాలాలకు సబంధించిన నాణేలు, సంపద, ఇతర వస్తువులు బయటపడటం మనం చూస్తూ ఉంటాం. తాజాగా తెలంగాణలోని నారాయణ్ ఖేడ్ మండంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

మండలంలోని హనుమంతరావిపేట గ్రామంలో బంజే సరోజ అనే మహిళా రైతు పొలంలో భూమి చదును చేస్తుండగా.. పురాతన వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే.. స్థానికులు పెద్ద ఎత్తున.. ఆ విగ్రహాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. సరోజ కుటుంబానికి గ్రామ శివారులోని.. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా పొలం ఉంది. ఆ పొలంలోనే ఎప్పట్నుంచో వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. తొలకరి మొదలవ్వడంతో ఈ సారి కూడా.. వ్యవసాయ పనులు మొదలెట్టారు. జూన్ 23, ఆదివారం బేసీబీతో  పొలం చదును చేస్తుండగా.. పురాత వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. రెండున్నర నుంచి.. 3 కిలోల బరువు ఉన్న ఆ విగ్రహం పంచలోహలతో తయారు చేసిందని స్థానిక పూజారులు చెబుతున్నారు.

ఈ విషయం గ్రామస్థులకు తెలియజేయటంతో.. కొందరు మహిళలు అక్కడికి వచ్చి పూజలుు చేశారు. భక్తుల సందర్శనార్థం.. ఆ విగ్రహాన్ని అక్కడి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంచారు. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Venkateswara Swamy

గతంలోనూ ఇలా పొలం పనులు చేస్తుండగా.. వజ్రాలు, వైడూర్యాలు, పురాతన నాణేలు, వివిధ రకాల దేవుళ్లు, దేవతల విగ్రహాలు బయపడిన ఘటనలు ఉన్నాయి. కొందరికి అయితే లంకె బిందెలు కూడా దొరికాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…