PM Modi Tour: కనుకరించిన ప్రకృతి.. భారీగా తరలివచ్చిన జనం.. సంజయ్‌ను అభినందించిన మోదీ..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల బహిరంగ సభ సక్సెస్‌తో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్టయింది. దూకుడు మీద ఉన్న బీజేపీ నాయకులకు ప్రధాని టూర్ మరింత జోష్ నింపినట్టయింది. కరీంనగర్ లోకసభ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల బహిరంగ సభ సక్సెస్‌తో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్టయింది. దూకుడు మీద ఉన్న బీజేపీ నాయకులకు ప్రధాని టూర్ మరింత జోష్ నింపినట్టయింది. కరీంనగర్ లోకసభ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఉదయమే బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో జన సమీకరణ సాధ్యమవుతుందా లేదా అన్న మీమాంసలకు చెక్ పెట్టేసినట్టయింది. ప్రధాని వేములవాడ చేరుకునే సరికే సభా ప్రాంగణమంతా కూడా నిండిపోవడంతో బీజేపీ నాయకుల అంచనాలు సఫలం అయ్యాయి.
మద్యాహ్నం తరువాత నిర్వహించే బహిరంగ సభలకు జనసమీకరణ సాధ్యమవుతుంది. అయితే స్థానిక బీజేపీ నాయకులు కాస్తా భిన్నంగా ఆలోచించి ఉదయం వేములవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రధానమంత్రి మోదీ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో బీజేపీ ఉదయం పూట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ధైర్యం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి జనం సభా వేదిక వద్దకు చేరుకోవడం అసాధ్యమే అయినా అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రణాళికలు తయారు చేసుకున్నారు.

Modi In Vemulawada
అయినప్పటికీ సభ సక్సెస్ అవుతుందా..? 10 గంటల వరకు జనం సభాస్థలికి చేరుకుంటారా..? అన్న అనుమానం వెంటాడింది. మరో వైపున మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కూడా రావడంతో పార్టీ శ్రేణులు మరింత ఆందోళన చెందాయి. అయితే మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇతర నాయకుల కార్యక్రమాలు కూడా అసంపూర్తిగా జరగడంతో బీజేపీ నాయకులు అప్రమత్తం అయ్యారు. ఎంపీ బండి సంజయ్ వేములవాడ చేరుకుని బహిరంగ సభా వేదిక వద్ద పకడ్భందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Bjp
వేములవాడ సభకు హజరైన ప్రధాని మోదీ ప్రాంగణాన్ని పరిశీలించి స్థానిక నేతలకు కితాబిచ్చారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తానే స్వయంగా సభ ఏర్పాటు చేసినా ఇంత ఉదయం ఈ స్థాయిలో జనసమీకరణ సాధ్యం అయ్యేది కాదని వ్యాఖ్యానించడంతో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకుల్లో నయా జోష్ నింపినట్టయింది. ఇప్పటికే ఏడు సెగ్మెంట్లలో ప్రచార పర్వాన్ని పూర్తి చేసుకున్న బీజేపీ నాయకులు గెలుపు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అభింనందనలతో మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

Modi Imeeting N Vemulawada
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..