యాక్సిడెంట్‌లో తండ్రి మరణం.. పాలసీ క్లెయిమ్ కోసం కొడుకు రిక్వెస్ట్.. కట్‌చేస్తే..
LIC Policy: దీంతో కన్జ్యూమర్ జిల్లా కమిషన్‌ను ఆశ్రయించాడు బాధితుడు. పూర్వపరాలు తెలుసుకున్న కమిషన్ రికార్డులను పరిశీలించింది. బాధితుడు తండ్రి ప్రభాకర్ ఒక రోడ్ యాక్సిడెంట్‌లో మరణించాడు. అతడి మృతదేహాన్ని తొగుట అధికారులు గుర్తించారు. ఎల్ఐసీలో జీవన్ అమర్ పాలసీ కడుతూ వస్తున్నాడు. ఎల్ఐసీ పాలసీతో పాటు మరో రెండు పాలసీలు కూడా ఉన్నాయి. తన కూతురును మిగతా రెండు పాలసీలకు నామినీగా పెట్టారు.

తన తండ్రిని కోల్పోయిన కొడుకుకు 80 లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని ఎల్ఐసీ సంస్థకు జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. కొద్ది నెలల క్రితం తన తండ్రి చనిపోవడంతో ఎల్ఐసీ ఇన్సూరెన్స్ ప్రకారం రావాల్సిన 80 లక్షల రూపాయలు కోసం ఎల్ఐసీని ఆశ్రయించాడు. అయితే, తన తండ్రికి ఒక పాలసీకి మించి మరొక రెండు పాలసీలు అతని పేరు మీద ఉన్నట్టు ఎల్ఐసీ అధికారులు తెలిపారు. ఎల్ఐసీ పాలసీ ప్రకారం ఒక వ్యక్తికి కేవలం ఒక పాలసీ మాత్రమే ఉండాలని, అప్పుడే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులని తెలుపుతూ నిబంధనలకు విరుద్ధంగా తన తండ్రి ఒక పాలిసీకి మించి మరో రెండు పాలసీలను మెయింటెన్ చేసినట్టు తెలిసింది. కాబట్టి, డబ్బులు క్లైమ్ చేయడానికి వీలుపడదని బాధితుడికి తెలిపారు.
దీంతో కన్జ్యూమర్ జిల్లా కమిషన్‌ను ఆశ్రయించాడు బాధితుడు. పూర్వపరాలు తెలుసుకున్న కమిషన్ రికార్డులను పరిశీలించింది. బాధితుడు తండ్రి ప్రభాకర్ ఒక రోడ్ యాక్సిడెంట్‌లో మరణించాడు. అతడి మృతదేహాన్ని తొగుట అధికారులు గుర్తించారు. ఎల్ఐసీలో జీవన్ అమర్ పాలసీ కడుతూ వస్తున్నాడు. ఎల్ఐసీ పాలసీతో పాటు మరో రెండు పాలసీలు కూడా ఉన్నాయి. తన కూతురును మిగతా రెండు పాలసీలకు నామినీగా పెట్టారు. ఈ రెండు పాలసీలు ఇప్పటికే సెటిల్ అయిపోయాయి. కానీ, 2019 లో తీసుకున్న పాలసీలో మిగతా పాలసీల గురించి ఎల్ఐసీ సంస్థకు చెప్పలేదు. కాబట్టి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు కుమారుడు సూర్య స్నేహిత్ అనర్హుడు అంటూ కన్జ్యూమర్ కమిషన్‌కు ఎల్ఐసీ అధికారులు తెలిపారు.
మిగతా రెండు పాలసీలు ఉన్నప్పటికీ ధ్రువీకరించలేదు. కాబట్టి, బాధితుడు కడుతున్న పాలసీని సికింద్రాబాద్ ఎల్ఐసీ డివిజనల్ ఆఫీసు తిరస్కరించినట్టు తెలిపారు. ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం పాలసీ క్లైమ్ కు బాధితుడు అనర్హుడని ఎల్ఐసీ ప్రతినిధులు కోర్టుకు ధ్రువీకరించారు. తిరువూరు వాదనలు విన్న తర్వాత బాధితుడికి సెక్షన్ 45 ఇన్సూరెన్స్ యాక్ట్ వర్తించదని కన్స్యూమర్ కమిషన్ అభిప్రాయపడింది. బాధితుడికి 80 లక్షల రూపాయల నగదుతో పాటు ఇతర బెనిఫిట్లను 9% రూపంలో చెల్లించాలని ఎల్ఐసీ సంస్థను ఆదేశించింది. దాంతోపాటు 25 వేల రూపాయల పరిహారం చెల్లించాలని కన్జ్యూమర్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని లోకల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
