అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్త్తారా..? కాంగ్రెస్ సర్కార్ ఎం చేయబోతోంది..?

| Edited By: Balaraju Goud

Sep 12, 2024 | 5:48 PM

తెలంగాణలో అరాచక పాలనతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడి, ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న రాజాకారులను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ. ఈ పోరాటంలో ఎంతో మంది అసువులుబాశారు. వారిని స్మరించుకునేందుకు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతున్నారు.

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్త్తారా..? కాంగ్రెస్ సర్కార్ ఎం చేయబోతోంది..?
Telangana Liberation Day
Follow us on

తెలంగాణలో అరాచక పాలనతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడి, ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న రాజాకారులను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ. ఈ పోరాటంలో ఎంతో మంది అసువులుబాశారు. వారిని స్మరించుకునేందుకు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతున్నారు. అయితే గత పదేళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండి తెలంగాణ విమోచన ఉత్సవాలకు దూరంగా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తూ వచ్చింది.

తెలంగాణ విమోచన దినాన్ని గత రెండేళ్ల నుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. నిజాం పాలన అదే విధంగా వారి వికృత చేష్టలు వెల్లగడుతూ ప్రత్యేక స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. వారి పాలన ఏ విధంగా ఉందనేది అద్దం పట్టే విధంగా ఆ ఫోటో ఎగ్జిబిషన్ లో కనిపించేది. అయితే గత పదేళ్ల నుండి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉత్సవాలకు దూరంగా ఉండటంతో బీజేపీ ఆధ్వర్యంలోనే జరిపించారు. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాలో ఏర్పాట్లు చేయాలని సర్కులర్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా జిల్లాకు ఇంచార్జ్‌లుగా మంత్రులను నియమించారు.

తెలంగాణలో ప్రజా పాలన నడుస్తోంది. మా ప్రభుత్వం అందరితో కలిసి అభివృద్ధి కోసం పాటు పడతాం. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పటికే సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదీ ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..