Leopard: ములుగు జిల్లా ఏజన్సీలో చిరుత సంచారం.. చెట్టుపై ఉన్న చిరుతను చూసి యువకుల పరుగులు

|

Feb 22, 2021 | 2:43 PM

Leopard: ములుగు జిల్లా ఏజన్సీలో చిరుత సంచారం పరిసర ప్రాంతాలకు ప్రజలకు తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఏజన్సీ వాజేడు మండలంలో ఈ చిరుత సంచరిస్తోంది. కొంగల జలపాతం ..

Leopard: ములుగు జిల్లా ఏజన్సీలో చిరుత సంచారం.. చెట్టుపై ఉన్న చిరుతను చూసి యువకుల పరుగులు
Follow us on

Leopard: ములుగు జిల్లా ఏజన్సీలో చిరుత సంచారం పరిసర ప్రాంతాలకు ప్రజలకు తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఏజన్సీ వాజేడు మండలంలో ఈ చిరుత సంచరిస్తోంది. కొంగల జలపాతం సమీపంలోని అడవిలో పులి సంచరిస్తున్నట్లు కొందరు యువకులు గమనించారు. అయితే అడవిలోని ఓ చెట్టుపై ఉన్న పులిని చూసిన యువకులు పరుగులు పెట్టారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తున్న ప్రదేశానికి, కొంగల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిరుతను వెంటనే పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

కాగా, నాలుగు నెలల కిందట ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పులి సంచారం అక్కడి ప్రజలకు కంటినిండ కునుకు లేకుండా చేస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం అటవీ ప్రాంతాల్లోనూ, ములుగు మండలం పెగడపల్లి గ్రామ శివారులోనూ చిరుత సంచరిస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్‌పల్లి అటవీ ప్రాంత పరిసరాల్లో సంచరిస్తున్న చిరు ఓ ఆవును, అడవి పందిని చంపిన ఆనవాళ్లు గుర్తించారు ప్రజలు. దీంతో గ్రామస్థులెవ్వరూ ఒంటరిగా తిరగొద్దని, పులిని చంపేందుకు ఉచ్చులు, కరెంటు తీగలు పెట్టవద్దంటూ అప్పట్లోనే అధికారలు దండోరా వేశారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఈ ఉదయం వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో చెట్టుపై పులి కనిపించడంతో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది.

గిరిజన ప్రాంతంలో క్షుద్రపూజల కలకలం. నడిరోడ్డుపై మనిషి ఆకారంలో ముగ్గులు,కుంకుమ జల్లిన ఆనవాళ్లు. వైరల్‌ వీడియో