Leopard: రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో స్థానికులు

|

Jan 12, 2025 | 11:09 AM

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మార్నింగ్ వాక్‌కు వెళ్లిన పలువురికి చిరుత కనిపించింది. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి.. అక్కడి నుంచి చెట్లల్లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు సైతం గుర్తించారు. ఈ ఘటన తెలియడంతో విద్యార్థులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Leopard: రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో స్థానికులు
Leopard
Follow us on

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మార్నింగ్ వాక్‌కు వెళ్లిన పలువురికి చిరుత కనిపించింది. దీంతో వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి.. అక్కడి నుంచి చెట్లల్లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు సైతం గుర్తించారు. ఈ ఘటన తెలియడంతో విద్యార్థులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

గ‌తంలోనూ రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ క్యాంప‌స్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిరుత పులి సంచ‌రించింది. అప్పుడు చిరుత‌ను బంధించారు అధికారులు. చిరుతపులి శంషాబాద్, గ‌గ‌న్‌ప‌హాడ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండి హిమాయత్‌సాగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్‌లోని గ్రామాల చుట్టూ సంచ‌రిస్తున్న‌ట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..