Leopard Attack: తెలంగాణలో వన్యమృగాలు వనవాసం వదిలి.. జనావాసానికి అలవాటు పనిట్లుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కృర మృగాలు పలు జిల్లాల్లో హల్‌చల్ చేస్తుండగా.. తాజాగా.. నిర్మల్ జిల్లాలో చిరుతి పులి కలకలం రేగింది. ఇవాళ భైంసా మండలం పాంగ్రీ గ్రామ శివారులో చిరుత పులి ఓ అడవి పందిపై దాడి చేసి చంపేసింది. చిరుత ఆనవాళ్లను గమనించిన గ్రామస్తులు హడలిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. చిరుత అడుగుజాడలను పరిశీలించారు.
అక్కడ ఉన్న పాద ముద్రల ఆధారంగా పందిని చంపేసింది చిరుత పులే అని నిర్ధారించారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా చిరుత పులి గ్రామ శివారులో రెండు జింకలను చంపి తిన్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. దాదాపు నెల రోజులుగా చిరుత పులి గ్రామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో పాంగ్రీ గ్రామ ప్రజలు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఎటు వైపు నుంచి చిరుత వస్తోందో అని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. చిరుతను బందించాలని అటవీశాఖ అధికారులను అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు.
Also read:
దిగ్గజ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ గులమ్ ముస్తాఫా ఖాన్ కన్నుమూత.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం